మున్సిపల్ రిజర్వేషన్స్ పై ఉత్కంఠత
మున్సిపల్ రిజర్వేషన్లపై ఉత్కంఠత
-- ఆశావహుల్లో టెన్షన్ టెన్షన్
--ఆత్మకూరులో ఊపందుకున్న చర్చలు
ఆత్మకూరు, మేజర్ న్యూస్, సోమ వెంకటసుబ్బయ్ :
మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుండడం తో ఆత్మకూరులో మున్సిపల్ చైర్మన్ పీఠం, వార్డుల రిజర్వేషన్లపై ఉత్కంఠ భరిత చర్చలు ఆరంభమయ్యాయి. ఆశావహుల్లో టెన్షన్ కనిపిస్తోంది. రిజర్వేషన్ల ప్రతిపాదనలు అధికారుల వద్ద సిద్ధమైనా గోప్యంగా ఉంచారు. కోర్టు వివాదాలు పరిష్కారమై ఎన్నికల కమిషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చేముందు ఈ రిజర్వేషన్లు ఖరారు చేసి వెలువరించనున్నారు. ఈ లోగా అన్ని పార్టీల్లో ఆశావహులు ఇదపా రిజర్వేషన్లు ఎలా ఉంటాయో అంటూ ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. చైర్మన్ పదవి ఏ సామాజిక వర్గాలకు రిజర్వ్ అవుతుంది, వార్డులు ఏ విధంగా రిజర్వేషన్ కాబోతున్నాయి అనే విషయమై అందరూ చర్చించుకుంటున్నారు. ఆశావహులు మరింత టెన్షన్ పడుతూ చర్చల్లో మునిగి తేలుతున్నారు. 2012లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిఆత్మకూరు శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తూ ఆత్మకూరును వెంకట్రావుపల్లి, నెల్లూరు పాలెం పంచాయితీలతో కలిపి మున్సిపాలిటీగా ఏర్పాటు చేయించారు. 2014లో ప్రప్రధమంగా మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించారుm ఆ ఎన్నికల్లో తెలుగుదేశం సభ్యుల సహకారంతో మున్సిపాలిటీని ఆనం సారధ్యంలో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అప్పట్లో మున్సిపల్ చైర్మన్ పదవి గిరిజనులకు రిజర్వు కావడంతో రాగి వనమ్మ చైర్ పర్సన్ పదవి చేపట్టారు. అనంతరం మళ్లీ 2021లో ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించగా చైర్మన్ పదవి మళ్లీ గిరిజనులకే రిజర్వ్ అయింది. ఈ ఎన్నికల్లో ఆత్మకూరు మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకోగా ఆ పార్టీకి చెందిన గిరిజన మహిళ గోపారం వెంకటరమణమ్మ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల వారి పదవీకాలం పూర్తి కావడంతో ప్రత్యేక అధికారి పాలన సాగుతోంది. గత ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ పదవి రెండు దపాలు గిరిజనులకు కేటాయించినందున ఈ దపా రొటేషన్ విధానంలో జనరల్ కానీ బీసీ గాని కావచ్చని భావిస్తున్నారు. జనరల్ అయితే అధికార పార్టీలో అభ్యర్థి ఎవరు, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి ఎవరు అనేది పలువురు చర్చించుకుంటున్నారు. ఎన్నికల్లో 23 వార్డులు ఉండగా ఈదపా అవార్డుల సంఖ్య 28కి పెరిగింది. గత ఎన్నికల సందర్భంగా ఒకటో వార్డు ఎస్సీ రిజర్వేషన్ కాగా మొలబంటి రాజశేఖర్ కౌన్సిలర్గా గెలుపొందారు. రెండో వార్డ్ జనరల్ గాగా దగ్గుపాటి శివ కోటారెడ్డి గెలుపొందారు. మూడో వార్డు బీసీ కాగా షేక్ గౌస్ బాషా గెలుపొందారు. నాలుగో వార్డ్ జనరల్ కాగా కోడూరు కౌసల్యమ్మ గెలుపొందారు. ఐదవ వార్డు బీసీ కాగా షేక్ మహబూబ్ బాషా గెలుపొందారు. ఆరో వార్డు ఓసి కాగా నోటి విజయ జ్యోతి గెలుపొందారు. ఏడో వార్డు బీసీ కాగా సయ్యద్ నౌషాద్ బేగం గెలుపొందారు.8వ వార్డు జనరల్ గాగా పుచ్చలపల్లి రాధిక గెలుపొందారు. 9వ వార్డు జనరల్ కాగా కొప్పోలు రమాదేవి గెలుపొందారు. పదో వార్డు జనరల్ కాగా తుమ్మల త్రివేణి గెలుపొందారు. 11వ వార్డు బీసీ కాగా గుడి సంధ్య గెలుపొందారు. 12వ వార్డు ఎస్సీ కాగా కొండ యుగలక్ష్మి గెలుపొందారు. 13వ వార్డు ఎస్సీ కాగా టి. తిరుపతమ్మ గెలుపొందారు. 14వ వార్డు బీసీ కాగా పొడమేకల పెంచలయ్య యాదవ్ గెలుపొందారు. 15వ వార్డు ఎస్టీ కాగా గోపారం వెంకటరమణమ్మ గెలుపొందారు. 16 వార్డు బీసీ కాగా దిల్షాద్ బేగం గెలుపొందారు. 17వ వార్డు బీసీ కాగా షేక్ సర్దార్ గెలుపొందారు. 18 వ వార్డు ఎస్టీ కాగా గంధళ్ల వేణు గెలుపొందారు. 19వ వార్డు ఎస్సీ కాగా కొండ స్వరూపారాణి గెలుపొందారు. 20వ వార్డు జనరల్ కాగా సూరా భాస్కర్ రెడ్డి గెలుపొందారు. 21 వ వార్డు ఓసి కాగా డాక్టర్ శ్రావణ్ కుమార్ గెలుపొందారు. 22వ వార్డు జనరల్ కాగా మాదాల శ్రీనివాసులు నాయుడు గెలుపొందారు. 23వ వార్డు జనరల్ కాగా చెరుకూరు కామాక్షయ్య నాయుడు గెలుపొందారు. కాగా రొటేషన్ విధానంలో ఈ దపా ఆయా వార్డులు ఏ రిజర్వేషన్ రానున్నాయి. ఈ విషయమై సర్వత్ర ఉత్కంఠత నెలకొనగా ఆశావహులు మాత్రం రిజర్వేషన్ ఎలా ఉంటుంది, తాము పోటీ చేసే అవకాశం ఉంటుందా లేదా, మారితే ఇతర వార్డుల్లో పోటీ చేయాల్సి వస్తుందా, చేసే అవకాశం లభిస్తుందా అంటూ టెన్షన్ టెన్షన్ గా చర్చించుకుంటున్నారు. అయితే మున్సిపల్ ఎన్నికల బీసీ రిజర్వేషన్ విషయమై సుప్రీంకోర్టులో ప్రభుత్వం సవాల్ చేసినందున అక్కడ పరిష్కారమయ్యాక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని, రిజర్వేషన్ల పరిస్థితి వెల్లడవుతుందని భావిస్తున్నారు. అప్పటివరకు ఈ ఉత్కంఠత టెన్షన్ కొనసాగాల్సిందే.