టెక్కలి–ఇచ్చాపురం హైవే మరమ్మతులకు చర్యలు
శ్రీకాకుళం: అక్టోబర్ 04 మేజర్ న్యూస్ : ఇటీవల కురిసిన వర్షాలకు టెక్కలి నుంచి ఇచ్చాపురం వరకు జాతీయ రహదారి పలు ప్రాంతాల్లో ఇబ్బందికరంగా తయారైన పరిస్థితిని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సమీక్షించారు. తుఫాన్ నేపథ్యంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రహదారిపై పెద్దఎత్తున గోతులు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని తెలుసుకున్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు.. పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. NHAI ప్రాజెక్ట్ డైరెక్టర్ తో మాట్లాడి రహదారి పరిస్థితిని సమీక్షించారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా తక్షణమే మరమ్మతు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లోగా టెక్కలి–ఇచ్చాపురం జాతీయ రహదారిపై మరమ్మతు పనులు ప్రారంభిస్తామని NHAI అధికారులు హామీ ఇచ్చారు. ప్రజల ప్రయాణ సౌకర్యం, రహదారి భద్రతకు ప్రాధాన్యతనిస్తూ సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నారు.