BREAKING
దేవర చుట్టమల్లే ఏఐ మార్ఫింగ్ వీడియోపై కుష్బూ సుందర్ తీవ్ర ఆగ్రహం.. మహిళల గౌరవం ఆటవస్తువు కాదంటూ ఘాటు వ్యాఖ్యలు ఎన్నికల సంఘం స్వతంత్ర తను కాపాడా లి ఎస్ ఐ ఆర్ ప్రక్రియ ను నిలిపివేయాలి... సీపీఐ - సిపిఎం… ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడాలి నేడు గార్లకు రానున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య కార్నెల్ విశ్వవిద్యాలయ సామూహిక అత్యాచార బాధితురాలికి బెదిరింపులు రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌గా డాక్టర్‌ ఎస్‌.ఎం. రాజేశ్వర్‌రావు స్థానిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ సన్నద్ధం పెనుగంచిప్రోలులో పార్టీ శ్రేణులకు సభ్యత్వ కార్డుల పంపిణీ ఏఐ మార్ఫింగ్ వీడియోలపై జాన్వీ కపూర్ ఆవేదన: అనుమతి లేకుండా మహిళల చిత్రాలతో కల్పిత కంటెంట్ లైంగిక దాడికి సమానమని వ్యాఖ్య, ఎన్టీఆర్, చిరంజీవికి కృతజ్ఞతలు రాంపల్లి మరో జవహర్‌నగర్‌గా మారొద్దు.. ! సెంట్రల్ అమెరికన్ పార్లమెంట్ నుంచి తప్పుకుంటున్నట్లు నికరాగ్వా సంచలన ప్రకటన బీసీల హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది... నాగండ్లలో నేత్రదానం కుమ్మరి సంఘ భవన నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందజేస్తాము* నాగండ్ల లో నేత్రదానం నారా లోకేష్ సంకల్పం.. నాగపూర్‌లో ఫడ్నవీస్‌కు వివరించిన రవి నాయుడు మంగళవారం జాబ్ మేళా

ఎస్ఐఆర్ అంటే మీకు ఎందుకు జంకు

Select Suryaa Now
ఎస్ఐఆర్ అంటే మీకు ఎందుకు జంకు

కాంగ్రెస్ నేతలు అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు

బ్యాలెట్ ఓటు పై మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదు

ఓటమి భయంతో రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై కాంగ్రెస్ విషప్రచారం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు

తెలంగాణ బ్యూరో, ప్రతినిధి:
దేశవ్యాప్తంగా ఎదురవుతున్న వరుస ఎన్నికల పరాజయాలను తట్టుకోలేక, ప్రజాతీర్పును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అవమానిస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో వరుసగా మూడు పర్యాయాలు లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించి నరేంద్ర మోదీ ని మూడోసారి ప్రధానిగా ఆశీర్వదించడాన్ని ఆ పార్టీ నాయకత్వం జీర్ణించుకోలేకపోతోందని పేర్కొన్నారు. ప్రధాని పీఠం కేవలం నెహ్రూ-గాంధీ కుటుంబానికి మాత్రమే సొంతమనే రాచరికపు అహంకారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, ఒక సామాన్య 'చాయ్‌వాలా' దేశ ప్రధాని పదవిని చేపట్టి విజయవంతంగా పరిపాలన సాగించడాన్ని చూసి ఓర్వలేక ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
దేశంలో జరిగిన ఎన్నికలన్నీ బూటకమని, వాటిని రద్దు చేయాలంటూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడటం భారత ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును వినియోగించుకున్న కోట్ల మంది పౌరుల విచక్షణను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీతో పాటు ప్రకాష్ రాజ్ లాంటి శక్తులు ఏకమై భారత అత్యున్నత న్యాయస్థానం (సుప్రీం కోర్టు), రాష్ట్రపతి కార్యాలయం, భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) వంటి రాజ్యాంగబద్ధ స్వతంత్ర సంస్థలపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్నారని దుయ్యబట్టారు. ఈ విధంగా వ్యవస్థలను బలహీనపరిచి దేశ సమగ్రతకు భంగం కలిగించేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందని విమర్శించారు.
హైదరాబాద్ నగర పరిధిలో జరుగుతున్న ఎస్ఐఆర్ (ఎస్ ఐ ఆర్ - ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలన) ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పారు. ఈ ప్రక్రియను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగమే నిర్వహిస్తోందని, ఏవైనా అభ్యంతరాలుంటే వాటిపై ఎన్నికల సంఘం క్షేత్రస్థాయి విచారణ జరిపిన తర్వాత మాత్రమే ఓట్ల తొలగింపుపై నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఫామ్-7 సమర్పించినంత మాత్రాన ఓట్లు నేరుగా తొలగించబడవని, దొంగ ఓట్లు, నకిలీ ఓట్ల ఏరివేత కోసమే నిబంధనల ప్రకారం ఫామ్-7 విధానం ఉందని గుర్తుచేశారు. పైగా బీజేపీకి చెందిన బూత్ స్థాయి ఏజెంట్లు (బీఎల్ఏ-1, బీఎల్ఏ-2) ఎవరూ కూడా అటువంటి దరఖాస్తులు సమర్పించలేదని స్పష్టం చేశారు. విచారణ దశలోనే ఉన్న అంశంపై ఇప్పుడే ఓట్లు తొలగించేస్తున్నారంటూ కాంగ్రెస్ రాద్ధాంతం చేయడం పూర్తిగా అభ్యంతరకరమని అన్నారు.
ఎక్కడైనా ఎన్నికల్లో గెలిస్తే వ్యవస్థలు సక్రమంగా ఉన్నాయని, ఓడిపోతే మాత్రం ఈవీఎంలు, ఎస్ఐఆర్ ప్రక్రియలపై నిందలు వేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. కేరళ వంటి రాష్ట్రాల్లో గెలిచినప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రశంసించిన ఆ పార్టీ నేతలు, ఓడిపోయే చోట మాత్రం బురదజల్లుతున్నారని ఆక్షేపించారు. దేశంలో ఇప్పటికే అధిక భాగం 'కాంగ్రెస్ ముక్త్ భారత్' ఏర్పడిందని, మిగిలిన రెండు మూడు రాష్ట్రాల్లోనూ ప్రజలు ఆ పార్టీని తిరస్కరించడం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను కించపరుస్తూ, నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కాంగ్రెస్ పన్నుతున్న కుట్రలను భారత ప్రజలు ఎక్కడికక్కడ తిప్పికొడతారని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీజేపీ రాజీలేని పోరాటం చేస్తుందని ఎన్. రాంచందర్ రావు హెచ్చరించారు.