పెద్దేముల్ రైతు సేవ సహకార సంఘం చైర్మన్‌గా ఎల్లారెడ్డి
నియామక పత్రం అందజేసిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి
పెద్దేముల్,మేజర్ న్యూస్ (అక్టోబర్ 4): పెద్దేముల్ రైతు సేవ సహకార సంఘం చైర్మన్‌గా ఎల్లారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి ఎల్లారెడ్డికి నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ... రైతుల సంక్షేమం, సహకార సంఘం అభివృద్ధికి చైర్మన్‌గా ఎల్లారెడ్డి సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.ఎల్లారెడ్డి నియామకంపై మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపి, రైతులకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
రిపోర్టర్ ముకుంద్ రెడ్డి.