BREAKING
విలేకరుల శిక్షణలో రేణిగుంట 6టీవీ రిపోర్టర్ శీను భారత పారిశ్రామికోత్పత్తిలో విరుద్ధ ధోరణులు: టెక్స్‌టైల్స్, అపెరల్ తయారీ రంగాల మధ్య పెరుగుతున్న భారీ అంతరం అంబేద్కర్ లేకుంటే మన బ్రతుకులు ఏమయ్యేవి…? ఎస్ఐఆర్ అంటే మీకు ఎందుకు జంకు జాతీయ స్థాయి మేళాకి నారాయణపేట విద్యార్థి ఎంపిక జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వైద్య శిభిరం అభిమాని అతిచర్యకు షాకైన కన్నడ నటి రచితా రామ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో సంస్కార భారతి ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దాం : రాష్ట్ర సంఘటన మంత్రి జిపి నిరంజన్ 35 రూపాయలకే కిలో ఉల్లిపాయలు క్యాతన్ పల్లి లో నూతన సీతాఫల్ పల్ప్ కేంద్రం పరిశీలించిన జిల్లా అధికారులు మున్సిపల్ రిజర్వేషన్స్ పై ఉత్కంఠత సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలు.. మంత్రి తుమ్మల ఎన్టీఆర్‌కు మద్దతుగా నిలిచిన విజయ్ దేవరకొండ: ఏఐ దుర్వినియోగంపై హీరో తీవ్ర ఆగ్రహం కదిరిలో వివాహ వేడుకకు హాజరైన వైఎస్సార్‌సీపీ నాయకులు కైవ్‌లోని వంతెనతో పాటు నల్ల సముద్రంలో రెండు నౌకలపై రష్యా దాడులు

ఓబీసీ కాలమ్ చేర్చే వరకు కేంద్రంపై పోరాటం కొనసాగిస్తాం

Select Suryaa Now
ఓబీసీ కాలమ్ చేర్చే వరకు కేంద్రంపై పోరాటం కొనసాగిస్తాం

 

బీసీ కులగనణకై ఈనెల 8న ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం

ఓబీసీ కాలమ్ పై మాట్లాడని రాజకీయ పార్టీ నేతలు బీసీ ద్రోహులు

నవంబర్ లో పార్లమెంట్ సమావేశాలను అడ్డుకుంటాo

బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి

తెలంగాణ బ్యూరో, ప్రతినిధి: జాతి జన గణ మనలో ఓబీసీ కాలమ్ చేర్చాలని ప్రధాన డిమాండ్ తో గత రెండు నెలలుగా దేశవ్యాప్తంగా బీసీలు రోడ్లెక్కి ఉద్యమిస్తుంటే కేంద్ర ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం సిగ్గుచేటని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు.  హైదరాబాదులోని బీసీ భవన్ లో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి అధ్యక్షతన జరిగిన బీసీ సంఘాల సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఈనెల 8న ఢిల్లీలో జరిగే జాతీయ అఖిలపక్ష సమావేశo కు సంబంధించిన వాల్ పోస్టర్ ను ఈ సందర్భంగా బీసీ నేతలతో కలిసి జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. 
అనంతరం జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఓబిసి కులాల లెక్కలు తీయాలంటే కేంద్ర ప్రభుత్వం గడగడ ఉనికి పోతుందని బీసీల లెక్కలు తేలితే తమకు భవిష్యత్తులో రాజకీయంగా నష్టం జరుగుతుందని కుట్రతోనే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రస్తుతం జరిగే జనగణనలో ఓబీసీ కాలం చేర్చడం లేదని ఆయన ఆరోపించారు. ఓబీసీ కాలం చేర్చాలని ప్రధాన డిమాండ్ తో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టామని అందులో భాగంగానే జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు, గెజిట్ నోటిఫికేషన్లు చించివేత, రౌండ్ టేబుల్ సమావేశాలు, ధర్మ పోరాట దీక్షలు, నిరసన ర్యాలీలు చేపట్టడం జరిగిందని అయినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ కనీసం స్పందించకపోవడం చూస్తే బీసీలు అంటే నరేంద్ర మోడీకి గిట్టదని తేలిపోయిందన్నారు. ఇంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమం జరుగుతుంటే దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు వాటికి నేతృత్వం వహించే అధ్యక్షులు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి డిమాండ్ చేయాల్సిన వారు కనీసం మీడియా సమావేశం ఏర్పాటు చేసి కానీ, లేదా ఉద్యమ కార్యాచరణ గాని చేపట్టడం లేదన్నారు, బీసీ కులగనన చేయకుండా బిజెపి బీసీ వ్యతిరేక పార్టీగా మిగిలిపోతే, బీసీ కులగన చేయాలని డిమాండ్ చేయని పార్టీలు కూడా బీసీ ద్రోహుల పార్టీలుగా చరిత్రలో మిగిలిపోతాయని ఆయన హెచ్చరించారు జాతీయస్థాయిలో బీసీ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయడానికి ఓబి సి కాలమ్ డిమాండ్ పై దేశంలోని అన్ని రాజకీయ పార్టీల వైఖరిని తెలుసుకోవడానికి ఈనెల ఎనిమిదో తేదీన ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ లో జాతీయ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఇప్పటివరకు జరిగిన ఉద్యమంపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకుని, అన్ని రాజకీయ పార్టీల సలహాలు సూచనలతో ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్తామని ఆయన తెలిపారు. దేశంలోని 60 శాతం ఉన్న ఓబీసీలను జెండాలు మోహించుకుంటూ జిందాబాద్ లు కొట్టించుకొని ఓట్లు వేయించుకుంటున్న రాజకీయ పార్టీలు తమ విధానపరమైన వైఖరిని ఈనెల 8లోగా స్పష్టంగా వెల్లడించాలని లేనిపక్షంలో 8వ తేదీన ఢిల్లీలో జరిగే సమావేశంలో ఓబీసీల కాలం ఉద్యమానికి మద్దతు తెలపని రాజకీయ పార్టీలను బహిరంగంగా ప్రకటించి వాటిని రాజకీయంగా భూస్థాపితం చేయడానికి తమ ఉద్యమ కార్యచరణ ఉంటుందని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ సంఘని మల్లేశ్వర్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యాంకుర్మా, బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్, బీసీ జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ వల్లబోజు నరసింహ చారి, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇంద్రం రజక, బండిగారి రాజు గౌడ్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.