పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుదాం
అధిక సంఖ్యలో ఓటరు నమోదు చేపట్టాలి
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేష్ కుమార్
తాండూరు, మేజర్ న్యూస్ (అక్టోబర్ 4): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సత్తాను చాటేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రమేష్ కుమార్ పిలుపునిచ్చారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ఇప్పటి నుంచే ఓటరు నమోదు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.ఆదివారం తాండూరు పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియపై ఆయన చర్చించారు. తాండూరు పట్టణంతో పాటు ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల్లో అర్హులైన పట్టభద్రులందరినీ గుర్తించి అధిక సంఖ్యలో ఓటర్లుగా నమోదు చేయించాలని పార్టీ నాయకులకు సూచించారు.హైదరాబాద్, మహబూబ్‌నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో బీజేపీకి మంచి పట్టు, ప్రజాదరణ ఉందని రమేష్ కుమార్ పేర్కొన్నారు. అర్హత కలిగిన ఏ ఒక్క పట్టభద్రుడు కూడా ఓటరు నమోదుకు దూరం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి పట్టభద్రుడు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ కౌన్సిల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ నాగారం మల్లేశం, కౌన్సిలర్ అంతారం కిరణ్, నాయకులు విజయ్ కుమార్, కృష్ణ ముదిరాజ్, రజనీకాంత్, సాయిరెడ్డి, బాద్రేశ్వర్, బాలప్ప, శ్రీకాంత్, కృష్ణ, ప్రకాశ్, రాజు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ రామచందర్.