ఉచిత కంటి వైద్య శిబిరం అభినందనీయం సంకినేని రవీందర్ రావు
తుంగతుర్తి మేజర్ న్యూస్
అక్షర ఫౌండేషన్ సూర్యాపేట, శంకర కంటి హాస్పిటల్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో, సంకినేని కమలమ్మ–రామారావు గార్ల జ్ఞాపకార్థం ఎస్.కె.ఆర్. కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ వారి సౌజన్యంతో ఆదివారం తుంగతుర్తిలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర రాష్ట్ర నాయకులు సంకినేని రవీందర్ రావు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంకినేని రవీందర్ రావు మాట్లాడుతూ, మారుమూల ప్రాంతాల్లో ఉచిత కంటి వైద్య శిబిరాలను నిర్వహించడం అభినందనీయమని, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఇటువంటి వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. “సర్వేంద్రియాణాం నయనం ప్రధానం” అని పేర్కొంటూ, కంటి ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఐ క్యాంపులో మంచి సర్వీస్ అందిస్తున్న శ్రీలక్ష్మి పారామెడికల్ కాలేజ్ సూర్యాపేట విద్యార్థులను అభినందించారు.
ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో 160 మంది కంటి సమస్యలతో వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం 30 మందికి కంటి ఆపరేషన్ అవసరమని గుర్తించగా, వారిని తదుపరి చికిత్స మరియు ఆపరేషన్ల కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లెపాక సాయిబాబా, అక్షర ఫౌండేషన్ చైర్మన్ యాస రాంకుమార్ రెడ్డి, ఐ క్యాంప్ కోఆర్డినేటర్ శివ రంగ, అక్షర ఫౌండేషన్ ప్రతినిధులు గౌరిశెట్టి అప్పారావు, దేవరకొండ సాయికుమార్, కోదాడ స్టాలిన్, జటంగి ముత్తయ్య, శంకర కంటి హాస్పిటల్ వైద్య సిబ్బంది, లక్ష్మీ పారామెడికల్ నర్సింగ్ విద్యార్థులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.