మాదిగ ఉద్యోగుల సమాఖ్య నూతన కమిటీకి ఘన సత్కారం
*మాదిగ ఉద్యోగుల సమాఖ్య నూతన కమిటీ కి ఘన సత్కారం*
*మాదిగ ఉద్యోగుల సమస్యల పైన శక్తివంచన లేకుండా పని చేస్తాం*– మాదిగ ఉద్యోగుల నాయకులు
పులివెందుల మేజర్ నుంచి :
మాదిగ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని మాదిగ ఉద్యోగుల నాయకులు పేర్కొన్నారు. పులివెందుల ప్రాంతానికి చెందిన జేసీ రామాంజనేయులు, రామసుబ్బయ్య, రవీంద్ర, గంగాధర్, రిగ్గర్ రవిలను మాదిగ ఉద్యోగుల సమాఖ్య కమిటీలో వివిధ బాధ్యతలకు నియమించిన సందర్భంగా పులివెందుల పట్టణంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మాదిగ ఉద్యోగులు నూతనంగా నియమితులైన నాయకులను దుశ్యాలువలు కప్పి, పూలగుచ్ఛాలు అందజేసి ఘనంగా సత్కరించారు. సమాఖ్య కమిటీలో బాధ్యతలు అప్పగించడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన నాయకులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి సమష్టిగా కృషి చేస్తామని తెలిపారు. మాదిగ ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, పదోన్నతులు, ఉద్యోగ భద్రత, సేవా సంబంధిత సమస్యల పరిష్కారంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. ఉద్యోగులందరూ ఐక్యంగా ఉండి సమాజ అభ్యున్నతికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పులివెందుల ప్రాంతానికి చెందిన మాదిగ ఉద్యోగులు, సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొని నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఫైర్ రామక్రిష్ణ, రక్తనిధి రాజు, న్యాయవాది హరిప్రసాద్, అడవి రాముడు, శ్రీనివాసులు, రాజు, డాన్స్ రాజా, రవీంద్ర, పాల్గొన్నారు