BREAKING
ఆయుర్వేద వైద్యశాలకు స్వచ్ఛ అవార్డుపై అభినందనలు పోడు భూముల సమస్యలపై త్వరలో తీపి కబురు ...మంత్రి పొంగులేటి ఖాళీ ప్రదేశానికి ఏ విధంగా ఇంటి నెంబర్లు ఎలా ఇస్తారు బిజెపి పట్టణ అధ్యక్షుడు కర్రే ప్రవీణ్ ఫ్లైదుబాయ్ కో-పైలట్ ఆస్ట్రేలియా సంబంధాలపై భద్రతా దళాల దర్యాప్తు రేపు సూడేపల్లిలో పట్టాదారు పాస్‌బుక్‌ల పంపిణీ మంత్రి తుమ్మలకు వేంసూరు రైతుల విజ్ఞప్తి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలి 4 కోట్లతో... 3 తారురోడ్లు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హౌతీల ఆధీనంలోని భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సైనిక చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం నేడు కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక. మోదీ అభివృద్ధికి ఆకర్షితులై బీజేపీలోకి 50 మంది చేరిక భక్తిశ్రద్ధలతో శ్రీ సుదర్శన హవనం క్షమాగుణమే ప్రతీకారానికి సరైన సమాధానం - ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఉద్బోధ టిడిపినేత వెంగయ్యను సత్కరించిన బద్వేలు టిడిపి ఇంచార్జి ఆలయంలో నిత్యారాధనలు భక్తులతో కిటకిటలాడిన యాదాద్రి

కళ్యాణ మండపం నిర్మాణం, భూ సమస్య పరిష్కారం కోసం వినతి

Select Suryaa Now
కళ్యాణ మండపం నిర్మాణం, భూ సమస్య పరిష్కారం కోసం వినతి

చీపురుపల్లి మేజర్ న్యూస్:

 పట్టణంలోని జి. అగ్రహారంలో కళ్యాణ మండపం నిర్మాణం కోసం, భూమి సమస్యలు శాశ్వత పరిష్కారం కోసం  శాసనసభ్యులు  కిమిడి కళా వెంకటరావుకి జి.అగ్రహారం వాసులు వినతి పత్రం అందజేశారు. గ్రామంలో పేదవారు పెళ్లిళ్ల సమయంలో వర్షాకాలం వస్తే ఇబ్బంది పడుతున్న దృశ్య గ్రామంలో సచివాలయం ఎదురుగా ఉన్న ఖాళీగా ఉన్న స్థలంలో కళ్యాణ మండపం కట్టాలని, అదేవిధంగా  గ్రామానికి చెందిన 1,190 ఎకరాలు  భూమిని సుమారు 500 కుటుంబాలు దానిమీద ఆధారపడి జీవిస్తున్న ఆరు వేల కుటుంబాలుకు చెందిన భూమి సర్వే జరుగుతున్న దృష్ట్యా భూమికి శాశ్వత పూర్తి యాజమాన్యం హక్కు కల్పించాలని, పట్టాదారు పాస్ పుస్తకాలు, వన్ బీ లు రావడానికి ప్రయత్నం చేయాలని కోరారు.  అతివృష్టి, అనావృష్టి కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు పంట నష్టపరిహారం వచ్చేవిధంగా కృషి చేయాలని రైతులందరూ తరపున వినతి పత్రం ఇచ్చారు. ఈ విషయంలో తన వంతు ప్రయత్నం  చేస్తామని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు హామీ ఇచ్చారు.