సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా వైద్య శిబిరం
సేవా సంకల్ప అభియాన్‌లో ఉచిత హెల్త్ క్యాంప్
ఎమ్మిగనూరు:
భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర, జిల్లా పార్టీ ఆదేశాల మేరకు సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా ఎమ్మిగనూరు పట్టణంలోని వివర్స్ కాలనీ మైదానంలో ఆదివారం ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు.
నియోజకవర్గ బీఎల్‌ఏ-1 కన్వీనర్ లలిత్ కుమార్ జైన్ సమక్షంలో పట్టణ బీజేపీ అధ్యక్షుడు వాల్మీకి దయాసాగర్ ఆధ్వర్యంలో సాయిరాం హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన ఈ శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. శిబిరంలో బీపీ, షుగర్, బరువు తదితర ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సమస్యలపై వైద్యులు ఉచిత సలహాలు, సూచనలు అందించారు. అవసరమైన వారికి మందులు కూడా సూచించారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రజా సేవలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులో మరిన్ని నిర్వహిస్తామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బిజెపి లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు వడ్డే ఊరుకుందు,కురవ బడేసాబ్, బంగి రాజేష్, వన్నెల బాలాజీ,, ఉప్పర రామ్ చరణ్, రవి కిరణ్, తిరుమల, అలాగే పట్టణ ఉపాధ్యక్షులు శ్రీ చక్ర నాగరాజ్, వడ్డే బజారి శిల్ప భాస్కర్, విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు ఆర్ సత్యనారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు