BREAKING
పాలకొండ శ్రీ పురటాల పాలమాంబ ఆలయంలో చోరీ రెడ్ క్రాస్ ములుగు జిల్లా కమిటీ సభ్యుడిగా వద్ది శ్రీనాథ్ రేపు"తోటపల్లి"లో వరుణ యాగం,వరుణ జపం ఉపాధి, విద్య రెండూ అవసరమే : DD AE అనిత గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో సందడే సందడిగా అంగన్వాడీ ఉత్సవం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు పీఎం శ్రీ పాఠశాల విద్యార్థులు అక్రమంగా తరలిస్తున్న 100 బస్తాల యూరియా సీజ్ సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి ప్రత్యేక గౌరవం జయప్రకాష్ కు గౌరవ డాక్టరేట్ వరద బాధిత విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ కర్లెమ్మ ఆర్ అండ్ ఆర్ కాలనీలో నీటికోసం గగ్గోలు గ్రీవెన్స్ అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన బీజేపీ నేతలు ఎస్ఆర్ఎస్ హాజరు గైర్హాజరు..!

శరవేగంగా సాగుతున్న యంగ్ ఇండియ ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవన నిర్మాణ పనులు.

Select Suryaa Now
శరవేగంగా సాగుతున్న యంగ్ ఇండియ ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవన నిర్మాణ పనులు.

 

కొందుర్గు మండల కేంద్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని షాద్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రం శివారులో 200 కోట్ల రూపాయల నిధులతో నిర్మాణం జరుగుతున్న పాఠశాల భవనం పనులను కృష్ణారెడ్డి పరిశీలించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా శాఖకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, అందులో భాగంగా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గ్ మండల కేంద్రానికి  యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు చేశారని అన్నారు. మండల కేంద్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవనం నిర్మాణం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారని తెలిపారు. షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో,  ప్రస్తుతం పాఠశాల భవన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని ఆయన వివరించారు. ఈ పాఠశాల నిర్మాణంతో కొందుర్గ్ మండలం రూపురేఖలు మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కందుకంల రాములు గౌడ్, జి జంగయ్య , జి వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.

ఈరమొల్ల సత్యనారాయణ, మేజర్ న్యూస్, కొందుర్గ్.