రెడ్ క్రాస్ ములుగు జిల్లా కమిటీ సభ్యుడిగా వద్ది శ్రీనాథ్
*రెడ్ క్రాస్ ములుగు జిల్లా కమిటీ సభ్యుడిగా వద్దీ శ్రీనాథ్. *సేవల విస్తరణకు కృషి చేస్తానన్న శ్రీనాథ్. *ఎన్నికల అధికారి ధర్మనాయక్ చేతుల మీదగా నియామక పత్రం అందజేత.
వెంకటాపురం నూగూరు, అక్టోబర్ 05, మేజర్ న్యూస్ సూర్య: భారతదేశంలో 1920 నుండి రక్తదాన శిబిరాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయం, ఉచిత వైద్య శిబిరాలు, పేద విద్యార్థులకు సహాయం లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థ ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (IRCS) ములుగు జిల్లా శాఖ నూతన కమిటీ ఎన్నికల్లో వెంకటాపురం మండలానికి చెందిన ప్రముఖ సామాజిక సేవ కుడు, ఎరువులు పురుగుమందుల దుకాణ.ప్రముఖ వ్యాపార వేత్త వద్ది శ్రీనాథ్ ను సేవా నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకొని జిల్లా కమిటీ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.ములుగు జిల్లా కలెక్టరేట్ లో సోమవారం ఎన్నికల అధికారి ధర్మానాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో నియామక ఉత్తర్వులను ఎన్నికల అధికారి ధర్మానాయక్ చేతుల మీదుగా శ్రీనాథ్ కు అందజేశారు.ఈ సందర్భంగా వద్ది శ్రీనాథ్ మాట్లాడుతూ సమాజ సేవలో రెడ్‌క్రాస్ సంస్థ అందిస్తున్న సేవలను ములుగు జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా గిరిజన ప్రాంతమైన వెంకటాపురం మండలంలో రక్తదానంపై అవగాహన,వైద్య శిబిరాలు,విపత్తు సమయంలో సహాయ చర్యల్లో ముందుండి సామాజిక సేవలను మరింత విస్తృతం చేస్తానని ప్రజలకు అవసరమైన సమయంలో సేవా కార్యక్రమాలను అందించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.తనపై నమ్మకంతో జిల్లా కమిటీ సభ్యునిగా అవకాశం కల్పించిన రెడ్‌క్రాస్ రాష్ట్ర,జిల్లా ప్రతినిధులకు,ఎన్నికల అధికారికి మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.