BREAKING
ఆర్డీవో కార్యాలయం ముందు పిడిఎస్యు విద్యార్థి సంఘం ధర్నా యూత్‌ను ఉర్రూతలూగించేందుకు వస్తోన్న హుషారు 2... కల్ట్ సీక్వెల్ అనౌన్స్‌మెంట్ ఓటర్ల జాబితా ప్రక్షాళనలో పారదర్శకతే ప్రజాస్వామ్యానికి బలం: డా శివ ప్రసాద్ కమిషనర్ తీరుపై అధికార, ప్రతిపక్షాల అసంతృప్తి….! నారాయణపేట మైనార్టీ స్కూల్ ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలి ఇటలీలో ఉద్యోగ కోతలు, బలవంతపు తొలగింపులు లేవని ట్రేడ్ యూనియన్ల వెల్లడి నేడు నారాయణపేట కలెక్టరేట్ ముట్టడి టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు సేవకు గుర్తింపు… సర్పంచ్ బందయ్యకు జాతీయ పురస్కారం..! స్టార్స్‌బక్స్‌కు చుక్కెదురు యూకే, ఇజ్రాయెల్ మధ్య తీవ్రమవుతున్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు హాకీ చరిత్రలో 2026-27 సీజనే తన చివరిదంటూ అలెగ్జాండర్ ఒవెచ్కిన్ ప్రకటన తూర్పు గంగవరంలో వరుణ యాగం పాల్గొననున్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి లాకర్‌బీ బాంబ్ పేలుడు కేసులో 2027 జనవరికి అమెరికా కోర్టు విచారణ ఖరారు యూకే ఆన్‌లైన్ సేఫ్టీ నిబంధనలపై మెటా, టిక్‌‌టాక్, ఎక్స్ న్యాయపోరాటం

ఉపాధి, విద్య రెండూ అవసరమే : DD AE అనిత

Select Suryaa Now
ఉపాధి, విద్య రెండూ అవసరమే :  DD AE అనిత

మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా అక్షరాస్యతను పెంపొందించే దిశగా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని డీడీఏఈ అనిత సూచించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం అనంతరం ఫరూఖ్నగర్ మండలం హాజీపల్లి గ్రామంలోని డీడబ్ల్యూసీఆర్ఎ భవనంలో ఆర్సైట్, ఫెమినా మహిళా సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జ్యూట్ బ్యాగ్ శిక్షణ కేంద్రాన్ని ఆమె సందర్శించారు. మహిళలకు అందిస్తున్న నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు, వాటి ద్వారా సాధ్యమవుతున్న ఆర్థిక స్వావలంబనపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా యూల్లోస్ కార్యక్రమంపై మహిళలకు అవగాహన కల్పిస్తూ హాజీపల్లి గ్రామాన్ని వంద శాతం శాతం అక్షరాస్య గ్రామంగా తీర్చిదిద్దేందుకు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మహిళలు తమ కుటుంబాల్లోని నిరక్షరాస్యులను గుర్తించి అక్షరాస్యత కార్యక్రమాల్లో చేర్చాలని సూచించారు. ఎంపీడీఓ శ్రీకాంత్ను యూల్లాస్ అమలు విజయవంతం చేసేందుకు అవసరమైన సిబ్బంది సహకారం అందించాలని కోరారు. గ్రామస్థాయిలో నిరంతర పర్యవేక్షణతో పాటు ప్రజల్లో అవగాహన పెంచే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక డీఆర్డీఓ, సెర్స్ ఏపీఎంలకు 3 నుంచి 5 ఉచిత కుట్టు, జర్లోసీ శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. గ్రామీణ యువతకు రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా ఉచిత శిక్షణ, భోజన వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ అనంతరం ఎస్ హెచ్ జి మహిళలకు శ్రీనిధి బ్యాంక్ ద్వారా రుణ సౌకర్యం కల్పించి వ్యాపారాభివృద్ధికి గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రాల నిర్వహకులే మార్గకత్వం ఇవ్వనన్నట్లు వెల్లడించారు. శిక్షణ కేంద్రాల్లో శిక్షణ పొందుతున్న లబ్ధిదారుల సహకారంతో యూల్లాస్ బోధనా తరగతులను పునఃప్రారంభించి ఉపాధి? అక్షరాస్యత కార్యక్రమాలను సమాంతరంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఆసక్తి గల వారు ఆధార్, వైబ్ రేషన్ కార్డు ప్రతులతో మండల మహిళా సమాఖ్య ఏపీఎంలను సంప్రదించాలని ఆమె తెలిపారు.

(రంగారెడ్డి -మేజర్ న్యూస్)