BREAKING
21 కి.మీ ఎత్తులో డీఆర్‌డీవో హై-ఆల్టిట్యూడ్ ఎయిర్‌షిప్ పరీక్ష విజయవంతం: దేశీయ హెచ్‌పీవీ వ్యాక్సిన్ ‘సెర్వావాక్’కు డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు... కెన్యాలో తొలి ఎబోలా కేసు నిర్ధారణ: చికిత్స పొందుతూ రోగి మృతి.. అప్రమత్తమైన ఆరోగ్యశాఖ, డబ్ల్యూహెచ్‌వో! ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలి :ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ కు వినతిపత్రం పేదలకు ప్రయోజనం చేకూర్చే ‘మీ మార్ట్’ ప్రారంభం రామన్నపాలెంలో పంచాయతీ కార్యదర్శులు, హరిత రాయబారులకు శిక్షణ కార్యక్రమం పొలం సంఘం ది - రిజిస్ట్రేషన్ వేరొకరికి ...:ఈతకోట బాబా నగర్ కాలనీ వాసులు కలెక్టర్ కు ఫిర్యాదు నేటి రాశి ఫలాలు – 7 అక్టోబర్ 2026 (బుధవారం) మామునూరు ఎయిర్ పోర్టుకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టాలి నేటి పంచాంగం 7 అక్టోబర్ 2026,బుధవారం ఉర్సు రావణాసుర వధ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయి గిరిజన చట్టాలకు తూట్లు పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను అభినందించిన వరంగల్ సిపి శ్రీ పద్మాక్షి దేవాలయ శరన్నవరాత్రి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

ఆర్డీవో కార్యాలయం ముందు పిడిఎస్యు విద్యార్థి సంఘం ధర్నా

Select Suryaa Now
ఆర్డీవో కార్యాలయం ముందు పిడిఎస్యు విద్యార్థి సంఘం ధర్నా

నారాయణపేట, సూర్యన్యూస్ : 
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నూతన భవన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు పీడీఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేష్ మాట్లాడుతూ.. శిథిలావసకు చేరుకున్న కళాశాల భవనం కూల్చి కొత్త భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. వర్షాకాలంలో ఎప్పుడు ఏ సంఘటన జరుగుతుందో తెలియక విద్యార్థులు భయానిక పరిస్థితుల్లో చదువును కొనసాగిస్తున్నారని, సంవత్సరాల కింద ఏర్పాటుచేసిన మౌలిక సదుపాయాలతోనే ముందుకు సాగించడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల ఆవరణలో తరచూ విషపురుగులు తిరుగుతుంటే విద్యార్థులలో ఎంతో భయానిక పరిస్థితులు నెలకొన్నాయని వాపోయారు. గత ఐదు సంవత్సరాలుగా పాలకులు హామీలు ఇస్తూనే ఉన్నారని, ఆచరణలో మాత్రం అమలు కావడం లేదని విమర్శించారు. వెంటనే నూతన భవనాన్ని నిర్మించి అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. మూత్రశాలలు, మరుగుదొడ్లు, ల్యాబ్, లైబ్రరీ తదితర అంశాలపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రాజు, జిల్లా కమిటీ సభ్యులు సురేష్, మాజీ జిల్లా ఉపాధ్యక్షులు గౌస్, కళాశాల అధ్యక్ష కార్యదర్శులు ప్రవీణ్, మోహన్, జ్యోతి, గాయత్రి, నాయకులు శ్రీకాంత్,శివ, శ్రీను, మంజునాథ్, శివకుమార్, విగ్నేష్,బాను, అంజి,మారుతీ, మోహన్, అఖిల, అంజమ్మ,అశ్విని, విక్రమ్ రాథోడ్, అశ్విని పాల్గొన్నారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట