తూర్పు గంగవరంలో వరుణ యాగం పాల్గొననున్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
తాళ్లూరు, మేజర్ న్యూస్ : మండలంలోని తూర్పు గంగవరం గ్రామంలో శ్రీ గుంటి గంగా భవాని అమ్మవారి దేవస్థానం వద్ద నిర్వహించనున్న వరుణ యాగం కార్యక్రమంలో దర్శి టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొననున్నారు.మంగళవారం ఉదయం 8.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ఆమె హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వరుణ యాగ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.