BREAKING
21 కి.మీ ఎత్తులో డీఆర్‌డీవో హై-ఆల్టిట్యూడ్ ఎయిర్‌షిప్ పరీక్ష విజయవంతం: దేశీయ హెచ్‌పీవీ వ్యాక్సిన్ ‘సెర్వావాక్’కు డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు... కెన్యాలో తొలి ఎబోలా కేసు నిర్ధారణ: చికిత్స పొందుతూ రోగి మృతి.. అప్రమత్తమైన ఆరోగ్యశాఖ, డబ్ల్యూహెచ్‌వో! ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలి :ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ కు వినతిపత్రం పేదలకు ప్రయోజనం చేకూర్చే ‘మీ మార్ట్’ ప్రారంభం రామన్నపాలెంలో పంచాయతీ కార్యదర్శులు, హరిత రాయబారులకు శిక్షణ కార్యక్రమం పొలం సంఘం ది - రిజిస్ట్రేషన్ వేరొకరికి ...:ఈతకోట బాబా నగర్ కాలనీ వాసులు కలెక్టర్ కు ఫిర్యాదు నేటి రాశి ఫలాలు – 7 అక్టోబర్ 2026 (బుధవారం) మామునూరు ఎయిర్ పోర్టుకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టాలి నేటి పంచాంగం 7 అక్టోబర్ 2026,బుధవారం ఉర్సు రావణాసుర వధ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయి గిరిజన చట్టాలకు తూట్లు పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను అభినందించిన వరంగల్ సిపి శ్రీ పద్మాక్షి దేవాలయ శరన్నవరాత్రి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు

Select Suryaa Now
టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు

విజయవాడ రూరల్‌, మేజర్ న్యూస్.

నిడమానూరు గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు బండి వెంకట్రావు (నాని) ఆధ్వర్యంలో మాజీ ఎంపీటీసీ (కో-ఆప్షన్‌ సభ్యుడు) ఎం.డి. ఇస్మాయిల్‌, మాజీ సర్పంచ్‌ సోమన సాయిబాబుతో పాటు వారి అనుచరులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీ ప్రభుత్వ విప్‌, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కూటమి నాయకులతో సమన్వయంతో పనిచేస్తూ గ్రామాభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. నిడమానూరులో టీడీపీని మరింత బలోపేతం చేసేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ అధ్యక్షుడు కానూరు యుగంధర్‌, టీడీపీ క్లస్టర్‌-3 ఇన్‌చార్జి అడుసుమిల్లి నవీన్‌, నాయకులు మాదాల నాని బాబు, అరవపల్లి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

గుర్రం ప్రసాద్, గన్నవరం.