BREAKING
21 కి.మీ ఎత్తులో డీఆర్‌డీవో హై-ఆల్టిట్యూడ్ ఎయిర్‌షిప్ పరీక్ష విజయవంతం: దేశీయ హెచ్‌పీవీ వ్యాక్సిన్ ‘సెర్వావాక్’కు డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు... కెన్యాలో తొలి ఎబోలా కేసు నిర్ధారణ: చికిత్స పొందుతూ రోగి మృతి.. అప్రమత్తమైన ఆరోగ్యశాఖ, డబ్ల్యూహెచ్‌వో! ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలి :ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ కు వినతిపత్రం పేదలకు ప్రయోజనం చేకూర్చే ‘మీ మార్ట్’ ప్రారంభం రామన్నపాలెంలో పంచాయతీ కార్యదర్శులు, హరిత రాయబారులకు శిక్షణ కార్యక్రమం పొలం సంఘం ది - రిజిస్ట్రేషన్ వేరొకరికి ...:ఈతకోట బాబా నగర్ కాలనీ వాసులు కలెక్టర్ కు ఫిర్యాదు నేటి రాశి ఫలాలు – 7 అక్టోబర్ 2026 (బుధవారం) మామునూరు ఎయిర్ పోర్టుకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టాలి నేటి పంచాంగం 7 అక్టోబర్ 2026,బుధవారం ఉర్సు రావణాసుర వధ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయి గిరిజన చట్టాలకు తూట్లు పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను అభినందించిన వరంగల్ సిపి శ్రీ పద్మాక్షి దేవాలయ శరన్నవరాత్రి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

ఓటర్ల జాబితా ప్రక్షాళనలో పారదర్శకతే ప్రజాస్వామ్యానికి బలం: డా శివ ప్రసాద్

Select Suryaa Now
ఓటర్ల జాబితా ప్రక్షాళనలో పారదర్శకతే ప్రజాస్వామ్యానికి బలం: డా శివ ప్రసాద్

హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాలపై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని డా. చినుకని శివ ప్రసాద్ అన్నారు.

అర్హులైన ఒక్క ఓటరిని కూడా అన్యాయంగా తొలగించకుండా కాపాడటం ఎంత ముఖ్యమో, డూప్లికేట్, మరణించిన, అనర్హ ఓటర్ల పేర్లను నిబంధనల ప్రకారం తొలగించడం కూడా అంతే ముఖ్యమన్నారు.

ఓటర్ల జాబితా సవరణలో ఇప్పటికే ఉన్న క్లెయిమ్స్, అభ్యంతరాలు, అప్పీల్ ప్రక్రియలను సమర్థవంతంగా, పారదర్శకంగా అమలు చేయాలని కోరారు.

ఎలాంటి రాజకీయ పక్షపాతానికి తావులేకుండా, ప్రతి ఓటరికి తన హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించడంతో పాటు ‘ఒక్క వ్యక్తికి ఒకే ఓటు’ అనే ప్రజాస్వామ్య సూత్రాన్ని కచ్చితంగా అమలు చేయాలన్నారు.

ఎన్నికల సంఘం స్వతంత్రత, నిష్పక్షపాతత్వం, విశ్వసనీయత విషయంలో ప్రజలకు ఎలాంటి సందేహాలు లేకుండా నిర్ణయ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాల్సిన బాధ్యత ఉందన్నారు.

ఆర్టికల్ 324 స్ఫూర్తికి అనుగుణంగా, అర్హులైన ఓటర్ల హక్కులను రక్షిస్తూ, అనర్హ మరియు డూప్లికేట్ నమోదులను తొలగించే సమతుల్య విధానాన్ని పాటించాలన్నారు.

ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసమే ప్రజాస్వామ్యానికి పునాది అని, ప్రతి అర్హుడి ఓటు రక్షించబడాలి—ప్రతి డూప్లికేట్ ఓటు తొలగించబడాలి అని డా. చినుకని శివ ప్రసాద్ స్పష్టం చేశారు.