telanagana
కమిషనర్ తీరుపై అధికార, ప్రతిపక్షాల అసంతృప్తి….!
Telanagana
05 Oct 2026
177 views
By సూర్య ప్రతినిధి
Updated : 05 Oct 2026 21:28 IST
Select Suryaa Now
మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో అధికారిక కార్యక్రమాలపై స్పష్టత ఏది..?
పారదర్శకంగా వివరాలు వెల్లడించాలని రాజకీయ పార్టీల డిమాండ్
శామీర్‌పేట, మేజర్ న్యూస్ (అక్టోబర్ 5):మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో అధికారిక కార్యక్రమాల నిర్వహణ, వాటి వివరాలను వెల్లడిస్తున్న మున్సిపల్ కమిషనర్ జి. వెంకట గోపాల్ తీరుపై అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలపై పూర్తి సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని వారు పేర్కొన్నారు.మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ కార్యక్రమాలు, నిధుల కేటాయింపులు, కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన వివరాలను ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలకు స్పష్టంగా తెలియజేయాలని డిమాండ్ చేశారు. అధికారిక కార్యక్రమాల విషయంలో ముందస్తు సమాచారం ఇవ్వడంతో పాటు, అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత కల్పించాలని కోరారు.
పారదర్శకత పాటించాలి
మున్సిపల్ పాలనలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని నేతలు అన్నారు. అధికారిక కార్యక్రమాలపై వివరాలు స్పష్టంగా వెల్లడించకపోవడం వల్ల అనవసర అనుమానాలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు.కమిషనర్ జి. వెంకట గోపాల్ అధికారిక కార్యక్రమాల నిర్వహణ, సమాచారం వెల్లడించే విధానంపై స్పష్టత ఇవ్వాలని, ప్రజలకు సంబంధించిన అంశాల్లో రికార్డుల ఆధారంగా వివరాలు వెల్లడించాలని వారు కోరారు. మున్సిపల్ వ్యవహారాల్లో రాజకీయాలకు అతీతంగా నిబంధనల ప్రకారం నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.