BREAKING
తప్పుడు లేబుళ్లు, పురుగుమందుల అవశేషాలతో భారత వ్యవసాయ ఎగుమతులకు బ్రేక్: యునిడో నివేదికలో విస్తుపోయే వాస్తవాలు! ఇరాన్ యుద్ధ నష్టాలు, మౌలిక వ్యయాలను ప్రపంచం పంచుకోవాల్సిందే: మధ్యప్రాచ్య చమురు దిగ్గజాల హెచ్చరిక! ఎన్ఎస్ఈ అన్‌లిస్టెడ్ షేర్లలో భారీ పతనం ప్లేగ్ వ్యాప్తి ముప్పు చాలా స్వల్పం: ప్రపంచవ్యాప్త ఆందోళనల వేళ డబ్ల్యూహెచ్‌వో స్పష్టత.. పటిష్ట నివారణ చర్యలు! ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ : పాలనా రంగంలో ఆయనను ప్రత్యేకంగా నిలిపిన అంశాలివే! కెప్టెన్ మచ్ఛర్ ప్రాణాలు కాపాడిన 45 నిమిషాల అత్యవసర చికిత్స: విమానంలో ఉత్కంఠ క్షణాలను పంచుకున్న డెంటిస్ట్! ఘనా అధ్యక్షుడితో విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ: ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై విస్తృత చర్చలు! గత నెలలో రూ. 1,345 కోట్ల విలువైన పనులు పూర్తి.. వేగం మరింత పెంచాలని ఆదేశం! సీఎం చంద్రబాబు కడప అమీన్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం: పీఠాధిపతి అరీఫుల్లా హుస్సేనీ ప్రత్యేక భేటీ! రాజధాని పనులపై నిర్మాణ సంస్థలతో సీఎం చంద్రబాబు సమీక్ష: 21 కి.మీ ఎత్తులో డీఆర్‌డీవో హై-ఆల్టిట్యూడ్ ఎయిర్‌షిప్ పరీక్ష విజయవంతం: దేశీయ హెచ్‌పీవీ వ్యాక్సిన్ ‘సెర్వావాక్’కు డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు... కెన్యాలో తొలి ఎబోలా కేసు నిర్ధారణ: చికిత్స పొందుతూ రోగి మృతి.. అప్రమత్తమైన ఆరోగ్యశాఖ, డబ్ల్యూహెచ్‌వో! ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలి :ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ కు వినతిపత్రం పేదలకు ప్రయోజనం చేకూర్చే ‘మీ మార్ట్’ ప్రారంభం

కడప అమీన్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం: పీఠాధిపతి అరీఫుల్లా హుస్సేనీ ప్రత్యేక భేటీ!

Select Suryaa Now
కడప అమీన్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం: పీఠాధిపతి అరీఫుల్లా హుస్సేనీ ప్రత్యేక భేటీ!

సూర్య అమరావతి బ్యూరో: సర్వమత సామరస్యానికి ప్రతీకగా నిలిచే చారిత్రక కడప పెద్ద దర్గా (శ్రీ అమీన్ పీర్ దర్గా) వార్షిక ఉర్సు మహోత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేయాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఆహ్వానం అందింది. అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి హజ్రత్ ఖ్వాజా సయ్యద్ షా ఆరీఫుల్లా హుస్సేనీ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి ఉర్సు ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ సందర్భంగా పీఠాధిపతి ముఖ్యమంత్రికి ప్రత్యేక దుశ్శాలువా కప్పి, దర్గా పవిత్ర తబరుక్ (ప్రసాదం) అందజేసి ప్రత్యేక ప్రార్థనలు (దువా) నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కడప పెద్ద దర్గాలో అత్యంత వైభవంగా జరగనున్న గంధం మహోత్సవం, ఉర్సు వేడుకల తేదీలు మరియు విశిష్టతను సీఎంకు వివరించారు. దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు, లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ వేడుకలకు సంబంధించి దర్గా కమిటీ చేపడుతున్న ఏర్పాట్లను తెలియజేశారు.

ఆహ్వానాన్ని స్వీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. దర్గా పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఉర్సు ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం తరఫున పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తామని హామీ ఇచ్చారు. ఉర్సు ఉత్సవాలకు హాజరయ్యే అంశంపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు దర్గా వర్గాలు పేర్కొన్నాయి.