చౌరస్తాలకు వెలుగులు.. హైమాస్ట్ లైట్ల ఏర్పాటు
మేడ్చల్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 5):రాత్రివేళ చీకటితో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడకుండా ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎల్లంపేట గ్రామం, డబిల్ పూర్ చౌరస్తా వద్ద హైమాస్ట్ లైట్లకు కొత్త లైట్లు ఏర్పాటు చేశారు.మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు డీఈ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టారు. చౌరస్తాల్లో రాత్రివేళ తగినంత వెలుతురు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని డీఈ తెలిపారు.డబిల్ పూర్ చౌరస్తా వద్ద కొత్త హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయడంతో రాత్రి వేళ ప్రయాణించే వారికి, స్థానిక ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని అధికారులు తెలిపారు. విడతల వారీగా వార్డు పరిధిలో ఉన్న మిగిలిన హాయ్ మాస్ లైట్లను కూడా బిగిస్తామని తెలియజేశారు.ఈ చర్యపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ మున్సిపల్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.