andhrapradesh
కర్లెమ్మ ఆర్ అండ్ ఆర్ కాలనీలో నీటికోసం గగ్గోలు
- అధికారులకు పిర్యాదు చేసినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపణ
కొత్తూరు: కొత్తూరు మండలం కర్లెమ్మ ఆర్ అండ్ ఆర్ కాలనీ లో మంచినీరు లేక కాలనీ వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారని దేశం నేత రీసు శ్రీను ఆరోపించారు.కాలనీ లో వాటర్ పంపు మరమ్మత్తులకు గురై వారం రోజులు కావస్తున్న అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు తెలిపారు .మంచినీటి ఎద్దడి సమస్య గుర్తించి దేశం నేత రీసు శ్రీను వాటర్ ట్యాంకర్ తో నీరు తెప్పించి ఇంటింటికి నీరు సరఫరా చేయించారు. అధికారులు పట్టించుకోలేక పోయినా శ్రీను సమస్య గుర్తించి నీరు సరఫరా చేయడం వలన కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేశారు. వంశధార నిర్వాసితులపై చులకన భావం చూపించకుండా తక్షణమే వాటర్ పంపు ను మరమ్మాత్తులు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. శ్రీనివాసరావు తో సహా కింజరాపు రామశంకర్ ,గొల్ల పాటి ప్రసాదరావు, బండి సింహాచలం.,అక్కేని మూర్తి తో సహా గ్రామస్తులు పాల్గొన్నారు.