BREAKING
పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను అభినందించిన వరంగల్ సిపి శ్రీ పద్మాక్షి దేవాలయ శరన్నవరాత్రి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ దంపతుల కొత్త సినిమా 'తూ హై మేరీ కిరణ్' ట్రైలర్ విడుదల! జాతీయ అవార్డు గ్రహీత చంద్రకళకు పోలీస్ శాఖ సత్కారం గ్రామీణ ప్రజలకు వైద్యం మరింత చేరువ: ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఎస్పీ బాలుతో ఆ జ్ఞాపకం ఇప్పటికీ మరువలేను.. ఎస్వీ కృష్ణా రెడ్డి ఎమోషనల్ పోస్ట్! చెత్తను సద్వినియోగం చేసుకోవాలి ఆశావర్కర్స్కు కనీసవేతనాలు చెల్లించాలి. అయోడిన్ లోప రుగ్మతల నియంత్రణకు జిల్లా స్థాయి సర్వే.. ఎముకల ఆరోగ్యం: వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు దృఢంగా ఉండాలంటే రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రొటీన్ లోపం రాకుండా ఉండాలంటే రోజువారీ మన శరీరానికి ఎంత ప్రొటీన్ అవసరమో తెలుసా? ఐరన్ లోపం: శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గి అలసట, తల తిరగడానికి అసలు కారణం ఏమిటో తెలుసా? కరీనా షోలో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌‌పుత్.. ఆ యాడ్ వివాదంపై కృతి సనన్ షాకింగ్ కామెంట్స్! లక్ష్మీపోలవరంలో అంగన్వాడీ ఉత్సవ్ ప్రజలకు శుభ్రమైన తాగునీరు అందేలా చర్యలు

నేడు తోటపల్లి ప్రాజెక్టులో చేప పిల్లలు విడుదల కార్యక్రమం

Select Suryaa Now
నేడు తోటపల్లి ప్రాజెక్టులో చేప పిల్లలు విడుదల కార్యక్రమం
  • చేప పిల్లలు విడిచిపెట్టనున్న ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి
  • టిడిపి కన్వీనర్ మరడాన నారాయణస్వామినాయుడు

గరుగుబిల్లి: తోటపల్లి భారీ నీటిపారుదల ప్రాజెక్టులో మంగళవారం చేప పిల్లలు విడుదల కార్యక్రమం జరుగుతుందని మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ మరడాన నారాయణస్వామినాయుడు సోమ వారం తెలిపారు.ఈమేరకు ఉదయం 9 గంటలకు తోటపల్లి భారీ నీటిపారుదల ప్రాజెక్టులో కురుపాం నియోజకవర్గం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి విడుదల చేయడం జరుగుతుందన్నారు.అనంతరం పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని ఉద్దవోలు గ్రామం లో సిమ్మెంటు రహదారి నిర్మాణం పనులకు శంకుస్థాపన చేయడం జరుగుతుందని మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ మరడాన నారాయణ స్వామినాయుడు వెల్లడించారు.అదే విధంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను మరింత చేరువ చేసే ఉద్దేశంతో ఉల్లిభద్ర గ్రామం లో నూతనంగా నిర్మాణం చేపట్టిన విలేజ్ హెల్త్ క్లినిక్ భవనమును శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి ప్రారంభించనున్నా రని టిడిపి కన్వీనర్ నారాయణస్వామి నాయుడు చెప్పారు.ఈకార్యక్రమానికి మండల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన కూటమి నాయకులు, కార్యకర్త లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని టీడీపీ కన్వీనర్ మరడాన నారాయణస్వామి నాయుడు కోరారు.