BREAKING
సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ దంపతుల కొత్త సినిమా 'తూ హై మేరీ కిరణ్' ట్రైలర్ విడుదల! జాతీయ అవార్డు గ్రహీత చంద్రకళకు పోలీస్ శాఖ సత్కారం గ్రామీణ ప్రజలకు వైద్యం మరింత చేరువ: ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఎస్పీ బాలుతో ఆ జ్ఞాపకం ఇప్పటికీ మరువలేను.. ఎస్వీ కృష్ణా రెడ్డి ఎమోషనల్ పోస్ట్! చెత్తను సద్వినియోగం చేసుకోవాలి ఆశావర్కర్స్కు కనీసవేతనాలు చెల్లించాలి. అయోడిన్ లోప రుగ్మతల నియంత్రణకు జిల్లా స్థాయి సర్వే.. ఎముకల ఆరోగ్యం: వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు దృఢంగా ఉండాలంటే రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రొటీన్ లోపం రాకుండా ఉండాలంటే రోజువారీ మన శరీరానికి ఎంత ప్రొటీన్ అవసరమో తెలుసా? ఐరన్ లోపం: శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గి అలసట, తల తిరగడానికి అసలు కారణం ఏమిటో తెలుసా? కరీనా షోలో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌‌పుత్.. ఆ యాడ్ వివాదంపై కృతి సనన్ షాకింగ్ కామెంట్స్! లక్ష్మీపోలవరంలో అంగన్వాడీ ఉత్సవ్ ప్రజలకు శుభ్రమైన తాగునీరు అందేలా చర్యలు విదేశాలకు వెళ్లే ముందు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి.. జిల్లా కలెక్టర్ డా. మహేష్ కుమార్ లో బ్రిడ్జి వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

అన్ని పంచాయతీల్లోనూ 'మన్యం మర్యాద' అమలు చేయాలి

Select Suryaa Now
అన్ని పంచాయతీల్లోనూ 'మన్యం మర్యాద' అమలు చేయాలి
  • ఆఫీసులు శుభ్రంగా లేకపోతే మంగళ వాయిద్యాలు మోగిస్తాం
  • ​పరిశుభ్రత పాటించకపోతే చర్యలు తప్పవు: మన్యం జిల్లా కలెక్టర్
  • పరిశుభ్రత, కార్యాలయాల నిర్వహణపై జిల్లా అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం

​పార్వతీపురం: అన్ని పంచాయతీల్లోనూ 'మన్యం మర్యాద' అమలు చేయాలి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా ఎన్ ప్రభాకర రెడ్డి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్. వైశాలి, పార్వతీపురం సబ్ కలెక్టర్ సచిన్ అర్చిత్ రహార్‌లతో కలిసి పలు కీలక విషయాలపై అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ​ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం మూడు మున్సిపాలిటీల్లో ప్రారంభించిన 'మన్యం మర్యాద' కార్యక్రమాన్ని వెంటనే అన్ని పంచాయతీలలోనూ అమలు చేయాలని ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే వారికి, పరిశుభ్రత పాటించని వారికి 'మంగళ వాయిద్యాలు' మోగిస్తూ, పూలు ఇచ్చి నమస్కారం చేస్తూ అవగాహన కల్పించాలని వినూత్న సూచనలు చేశారు. అలాగే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రాంగణాలు అత్యంత శుభ్రంగా ఉండాలని, ఆఫీసుల్లో డస్ట్‌బిన్లు ఏర్పాటు చేసుకుని దుమ్ము ధూళి లేకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. దీనికోసం ప్రత్యేక తనిఖీ బృందాలను రంగంలోకి దించుతున్నామని, నిబంధనలు పాటించని అధికారుల ఆఫీసుల వద్ద కూడా 'మన్యం మర్యాద' టీమ్‌లతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగులు, ప్రజలు ఉపయోగించే టాయిలెట్లను అత్యంత శుభ్రంగా నిర్వహించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదేనని తేల్చి చెప్పారు. గ్రీవెన్స్ సమావేశాలను వినియోగించుకుని వివిధ శాఖల మధ్య ఉన్న చిన్న చిన్న కోఆర్డినేషన్ సమస్యలను ఇక్కడే పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, పంచాయతీ, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.