BREAKING
సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ దంపతుల కొత్త సినిమా 'తూ హై మేరీ కిరణ్' ట్రైలర్ విడుదల! జాతీయ అవార్డు గ్రహీత చంద్రకళకు పోలీస్ శాఖ సత్కారం గ్రామీణ ప్రజలకు వైద్యం మరింత చేరువ: ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఎస్పీ బాలుతో ఆ జ్ఞాపకం ఇప్పటికీ మరువలేను.. ఎస్వీ కృష్ణా రెడ్డి ఎమోషనల్ పోస్ట్! చెత్తను సద్వినియోగం చేసుకోవాలి ఆశావర్కర్స్కు కనీసవేతనాలు చెల్లించాలి. అయోడిన్ లోప రుగ్మతల నియంత్రణకు జిల్లా స్థాయి సర్వే.. ఎముకల ఆరోగ్యం: వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు దృఢంగా ఉండాలంటే రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రొటీన్ లోపం రాకుండా ఉండాలంటే రోజువారీ మన శరీరానికి ఎంత ప్రొటీన్ అవసరమో తెలుసా? ఐరన్ లోపం: శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గి అలసట, తల తిరగడానికి అసలు కారణం ఏమిటో తెలుసా? కరీనా షోలో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌‌పుత్.. ఆ యాడ్ వివాదంపై కృతి సనన్ షాకింగ్ కామెంట్స్! లక్ష్మీపోలవరంలో అంగన్వాడీ ఉత్సవ్ ప్రజలకు శుభ్రమైన తాగునీరు అందేలా చర్యలు విదేశాలకు వెళ్లే ముందు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి.. జిల్లా కలెక్టర్ డా. మహేష్ కుమార్ లో బ్రిడ్జి వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

మామిడి రైతులకు శిక్షణ -సమగ్ర యాజమాన్యంతోనే అధిక దిగుబడులు డా.ఎస్.శ్రీనివాసులు

Select Suryaa Now
మామిడి రైతులకు శిక్షణ  -సమగ్ర యాజమాన్యంతోనే అధిక దిగుబడులు  డా.ఎస్.శ్రీనివాసులు

మామిడిలో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా అనవసర ఖర్చులు తగ్గించుకుని నాణ్యమైన దిగుబడులు పొందవచ్చని రాస్ కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త, హెడ్ డా.ఎస్.శ్రీనివాసులు తెలిపారు. రాష్ట్రీయ సేవా సమితి వారు కోకా-కోలా ఇండియా ఫౌండేషన్, న్యూఢిల్లీ సహకారంతో నిర్వహిస్తున్న "ఉన్నతి మ్యాంగో" పథకంలో భాగంగా తిరుపతిలోని రాస్ సేవా నిలయంలో మామిడి రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.పూతలపట్టు, ఐరాల, పులిచెర్ల, పాకాల, పుత్తూరు, తవనంపల్లి, రామచంద్రాపురం మండలాలకు చెందిన 100 మంది మామిడి రైతులకు నత్రజని, భాస్వరం, పొటాషియం జీవన ఎరువుల మిశ్రమం, కానుగ నూనె, సూక్ష్మ పోషకాల మిశ్రమం "మ్యాంగో స్పెషల్" పంపిణీ చేశారు.

యాజమాన్య పద్ధతులు సకాలంలో చేపట్టాలి

డా.శ్రీనివాసులు మాట్లాడుతూ, మామిడిలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు సరైన సమయంలో చేపడితే మంచి దిగుబడులతో పాటు నాణ్యమైన ఉత్పత్తులు వస్తాయని, రసాయన ఎరువుల స్థానంలో జీవన ఎరువులు, సూక్ష్మ పోషక మిశ్రమాలు వాడితే తోటల జీవితకాలం పెరగడంతో పాటు మామిడికి మంచి ధర వస్తుందని తెలిపారు. ఉన్నతి మ్యాంగో ప్రాజెక్ట్ లో ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాల ప్రభావాన్ని వివరించారు.ఉద్యాన శాస్త్రవేత్త పి.ఎస్.సుధాకర్ మాట్లాడుతూ, కొమ్మ కత్తిరింపులు చేసిన తోటల్లో లీటరు నీటికి యూరియా 10 గ్రాములు, సూక్ష్మపోషకాల మిశ్రమం 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేస్తే త్వరగా కొత్త చిగురు వచ్చి పూత తొందరగా వస్తుందని తెలిపారు. పచ్చిరొట్ట పైర్ల సాగుతో నేల ఆరోగ్యం మెరుగై నాణ్యమైన దిగుబడులు వస్తాయని, అజోస్పైరిల్లం, ఫాస్పోబాక్టీరియా, పొటాషియం మొబిలైజింగ్ బాక్టీరియాల మిశ్రమంతో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించవచ్చని సూచించారు.విస్తరణ శాస్త్రవేత్త రాము కుమార్ అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు.ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు సుధాకర్, రాము కుమార్, ఉన్నతి మ్యాంగో ప్రాజెక్ట్ సిబ్బంది చంద్రబాబు, కిషోర్ పాల్గొన్నారు..

సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి