కొత్తపల్లి రాము మృతి దేహం లభ్యం...
సీతానగరం: మండలం బూర్జ గ్రామం వద్ద సువర్ణ ముఖి నదిలో కొత్తపల్లి రాము అనే వ్యక్తి యొక్క మృతి దేహం లభ్యమైనట్టు ఎస్సై ఎం హేమలత తెలిపారు. ఈ మేరకు ఆమె తెలిపిన వివరాలు ప్రకారం చినబోగిలి గ్రామానికి చెందిన కొత్తపల్లి రాము అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో విజయవాడ లో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు . ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ పింఛన్ కొరకు ఆయన ఈనెల 1వ తేదీన గ్రామానికి వచ్చాడు. మూడవ తేదీ నాడు సీతానగరం కి వచ్చి తిరిగి గ్రామానికి వెళ్ళలేదు అని ఐదవ తేదీ నాడు బూర్జ గ్రామం వద్ద సువర్ణముఖి నదిలో ఆయన మృతి దేహం దొరకడం జరిగింది స్థానికుల సమాచారం మేరకు కుటుంబ సభ్యులు వెళ్లి గుర్తించి సీతానగరం పోలీస్ స్టేషన్కు మృతుడు భార్య అయిన సీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని శవపంచనాము నిమిత్తం పార్వతిపురం ఏరియా హాస్పిటల్ కి తరలించడం జరిగింది.మృతుడు కి భార్యతో పాటు వివాహమైన కుమార్తె ఉన్నది.