BREAKING
తూర్పు గంగవరంలో వరుణ యాగం పాల్గొననున్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి లాకర్‌బీ బాంబ్ పేలుడు కేసులో 2027 జనవరికి అమెరికా కోర్టు విచారణ ఖరారు యూకే ఆన్‌లైన్ సేఫ్టీ నిబంధనలపై మెటా, టిక్‌‌టాక్, ఎక్స్ న్యాయపోరాటం చౌరస్తాలకు వెలుగులు.. హైమాస్ట్ లైట్ల ఏర్పాటు కీసరగుట్టలో అనుమానాస్పద తవ్వకాలు..! సమాజ దిశ నిర్దేశకులు ఉపాధ్యాయులే. ప్రభుత్వ ఆస్తులపై అక్రమ పెత్తనం సహించం….! బిజెపి కార్యాలయంగా ఎస్ వి యు -విద్యార్థులకు ఒక రూల్, బీజేపీకి ఒక రూల్ - ఇదేనా కూటమి ప్రభుత్వ న్యాయం.? ఎన్ ఎస్ యు ఐ పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం అనంతగిరి ఘాట్ బస్సు ప్రమాదం.. డ్రైవర్ అరెస్ట్ ప్రజా ప్రభుత్వమా... లంచాల ప్రభుత్వమా? మామిడి రైతులకు శిక్షణ -సమగ్ర యాజమాన్యంతోనే అధిక దిగుబడులు డా.ఎస్.శ్రీనివాసులు నేడు తోటపల్లి ప్రాజెక్టులో చేప పిల్లలు విడుదల కార్యక్రమం అన్ని పంచాయతీల్లోనూ 'మన్యం మర్యాద' అమలు చేయాలి కొత్తపల్లి రాము మృతి దేహం లభ్యం...

కొల్లంపల్లిలో టీబీ స్క్రీనింగ్ క్యాంపు విజయవంతం

Select Suryaa Now
కొల్లంపల్లిలో టీబీ స్క్రీనింగ్ క్యాంపు విజయవంతం

నారాయణపేట, సూర్యన్యూస్: 
నారాయణపేట మండలం కొల్లంపల్లి గ్రామంలో సోమవారం టీబీ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించారు. కోటకొండ సబ్ సెంటర్ ఆధ్వర్యంలో డాక్టర్ నరసింహారావు హాజరై రోగులకు పరీక్షలు నిర్వహించి ఫుడ్ బిస్కెట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సిద్ధప్ప హాజరై వ్యాధి నివారణ, చికిత్సపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీబీని ముందుగానే గుర్తించి పూర్తి చికిత్స తీసుకోవడం ద్వారా వ్యాధిని పూర్తిగా నయం చేసుకోవచ్చని, ప్రజలు టీబీ లక్షణాలు కనిపించినప్పుడు సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. వైద్యుల సూచనల మేరకు టీబీ రోగులు క్రమం తప్పకుండా మందులు వాడుతూ, పోషకాహారం తీసుకోవాలని సూచించారు. క్యాంపుకు హాజరైన గ్రామ ప్రజలకు టీబీ వ్యాధి నిర్ధారణకు ఎక్సరే పరీక్షలు నిర్వహించారు.  కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ సత్య ప్రకాష్ రెడ్డి, సర్పంచ్ మన్నెమ్మ, ఉపసర్పంచ్ గోమాలి బజరంగ్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సత్య ప్రకాష్ రెడ్డి, డాక్టర్ లక్ష్మీకాంథ్, డాక్టర్ సాయిరాం, ఎన్సిడి కోఆర్డినేటర్ విజయ్ కుమార్, టీబి సూపర్వైజర్లు శ్రీధర్, ప్రసాద్, దశరథ్ ల్యాబ్ టెక్నీషియన్, ఏఎన్ఎం, ఆశలు,వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట.