BREAKING
పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను అభినందించిన వరంగల్ సిపి శ్రీ పద్మాక్షి దేవాలయ శరన్నవరాత్రి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ దంపతుల కొత్త సినిమా 'తూ హై మేరీ కిరణ్' ట్రైలర్ విడుదల! జాతీయ అవార్డు గ్రహీత చంద్రకళకు పోలీస్ శాఖ సత్కారం గ్రామీణ ప్రజలకు వైద్యం మరింత చేరువ: ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఎస్పీ బాలుతో ఆ జ్ఞాపకం ఇప్పటికీ మరువలేను.. ఎస్వీ కృష్ణా రెడ్డి ఎమోషనల్ పోస్ట్! చెత్తను సద్వినియోగం చేసుకోవాలి ఆశావర్కర్స్కు కనీసవేతనాలు చెల్లించాలి. అయోడిన్ లోప రుగ్మతల నియంత్రణకు జిల్లా స్థాయి సర్వే.. ఎముకల ఆరోగ్యం: వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు దృఢంగా ఉండాలంటే రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రొటీన్ లోపం రాకుండా ఉండాలంటే రోజువారీ మన శరీరానికి ఎంత ప్రొటీన్ అవసరమో తెలుసా? ఐరన్ లోపం: శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గి అలసట, తల తిరగడానికి అసలు కారణం ఏమిటో తెలుసా? కరీనా షోలో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌‌పుత్.. ఆ యాడ్ వివాదంపై కృతి సనన్ షాకింగ్ కామెంట్స్! లక్ష్మీపోలవరంలో అంగన్వాడీ ఉత్సవ్ ప్రజలకు శుభ్రమైన తాగునీరు అందేలా చర్యలు

అనంతగిరి ఘాట్ బస్సు ప్రమాదం.. డ్రైవర్ అరెస్ట్

Select Suryaa Now
అనంతగిరి ఘాట్ బస్సు ప్రమాదం.. డ్రైవర్ అరెస్ట్
నలుగురు మృతి.. పలువురికి గాయాలు | డ్రైవర్‌కు జ్యుడీషియల్ రిమాండ్
 
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (అక్టోబర్ 5): అనంతగిరి ఘాట్ రోడ్డులోని కేరెల్లి గ్రామ శివారులో ఈ నెల 3న జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారని సీఐ రఘురాములు తెలిపారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను సోమవారం పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా, జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపినట్లు ఆయన వెల్లడించారు.సీఐ రఘురాములు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 3న అనంతగిరి ఘాట్ రోడ్డులోని కేరెల్లి గ్రామ శివారులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు.ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు బస్సు డ్రైవర్ పాళ్త్యా వాసుదేవ్ అలియాస్ వాసు (30), తండ్రి ధర్మా నాయక్, సంగమేష్ తండా, రేగోడ్ మండలం, మెదక్ జిల్లాకు చెందిన వ్యక్తిని ప్రమాదానికి బాధ్యుడిగా గుర్తించారు. దీంతో అక్టోబర్ 5న అతడిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు.ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని రఘురాములు తెలిపారు. నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.