BREAKING
ఆర్డీవో కార్యాలయం ముందు పిడిఎస్యు విద్యార్థి సంఘం ధర్నా యూత్‌ను ఉర్రూతలూగించేందుకు వస్తోన్న హుషారు 2... కల్ట్ సీక్వెల్ అనౌన్స్‌మెంట్ ఓటర్ల జాబితా ప్రక్షాళనలో పారదర్శకతే ప్రజాస్వామ్యానికి బలం: డా శివ ప్రసాద్ కమిషనర్ తీరుపై అధికార, ప్రతిపక్షాల అసంతృప్తి….! నారాయణపేట మైనార్టీ స్కూల్ ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలి ఇటలీలో ఉద్యోగ కోతలు, బలవంతపు తొలగింపులు లేవని ట్రేడ్ యూనియన్ల వెల్లడి నేడు నారాయణపేట కలెక్టరేట్ ముట్టడి టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు సేవకు గుర్తింపు… సర్పంచ్ బందయ్యకు జాతీయ పురస్కారం..! స్టార్స్‌బక్స్‌కు చుక్కెదురు యూకే, ఇజ్రాయెల్ మధ్య తీవ్రమవుతున్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు హాకీ చరిత్రలో 2026-27 సీజనే తన చివరిదంటూ అలెగ్జాండర్ ఒవెచ్కిన్ ప్రకటన తూర్పు గంగవరంలో వరుణ యాగం పాల్గొననున్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి లాకర్‌బీ బాంబ్ పేలుడు కేసులో 2027 జనవరికి అమెరికా కోర్టు విచారణ ఖరారు యూకే ఆన్‌లైన్ సేఫ్టీ నిబంధనలపై మెటా, టిక్‌‌టాక్, ఎక్స్ న్యాయపోరాటం

వరద బాధిత విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

Select Suryaa Now
వరద బాధిత విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ
  • జనసేన ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్
    ఆమదాలవలస: బూర్జ మండలం అల్లెన గ్రామం ఇటీవల ఆర్నాబ్ తుఫాన్ ప్రభావంతో ముంపునకు గురైన నేపథ్యంలో, గ్రామంలో పర్యటించిన జనసేన ఇంచార్జ్, ఆమదాలవలస ఏఎంసీ చైర్మన్ పేడాడ రామ్మోహన్ రావు వరద పరిస్థితులను సోమవారం పరిశీలించారు. ఈ పర్యటనలో భాగంగా అల్లెన గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించిన ఆయన వరద బాధితుల విద్యార్థుల పుస్తకాలు, నోట్ బుక్స్ తడిసి పాడైపోయిన విషయాన్ని గమనించారు. విద్యార్థుల చదువుకు ఎటువంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో, పుస్తకాలు కోల్పోయిన ప్రతి విద్యార్థికి నూతన నోట్ బుక్స్ అందజేస్తానని అప్పట్లో హామీ ఇచ్చారు.
    ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ పేడాడ రామ్మోహన్ రావు అల్లెన గ్రామంలోని పాఠశాలకు చేరుకుని, పాఠశాల సిబ్బంది, జనసేన నాయకుల సమక్షంలో విద్యార్థిని, విద్యార్థులకు నూతన నోట్ బుక్స్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో విద్యార్థులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. వరదల కారణంగా విద్యార్థుల చదువుకు ఇబ్బంది కలగకుండా అవసరమైన సహాయాన్ని అందించేందుకు తాను ఎల్లప్పుడూ ముందుంటానని తెలిపారు.
    విద్యార్థుల చదువుకు అవసరమైన నోట్ బుక్స్ అందజేయడంపై పాఠశాల సిబ్బంది, విద్యార్థులు మరియు గ్రామస్థులు పేడాడ రామ్మోహన్ రావుకు  కృతజ్ఞతలు తెలిపారు.
    ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, జనసేన పార్టీ నాయకులు పొగిరి ఆనంద్, తోట అప్పలరాజు, అనుసూరి మన్మధరావు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.