BREAKING
ఆర్డీవో కార్యాలయం ముందు పిడిఎస్యు విద్యార్థి సంఘం ధర్నా యూత్‌ను ఉర్రూతలూగించేందుకు వస్తోన్న హుషారు 2... కల్ట్ సీక్వెల్ అనౌన్స్‌మెంట్ ఓటర్ల జాబితా ప్రక్షాళనలో పారదర్శకతే ప్రజాస్వామ్యానికి బలం: డా శివ ప్రసాద్ కమిషనర్ తీరుపై అధికార, ప్రతిపక్షాల అసంతృప్తి….! నారాయణపేట మైనార్టీ స్కూల్ ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలి ఇటలీలో ఉద్యోగ కోతలు, బలవంతపు తొలగింపులు లేవని ట్రేడ్ యూనియన్ల వెల్లడి నేడు నారాయణపేట కలెక్టరేట్ ముట్టడి టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు సేవకు గుర్తింపు… సర్పంచ్ బందయ్యకు జాతీయ పురస్కారం..! స్టార్స్‌బక్స్‌కు చుక్కెదురు యూకే, ఇజ్రాయెల్ మధ్య తీవ్రమవుతున్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు హాకీ చరిత్రలో 2026-27 సీజనే తన చివరిదంటూ అలెగ్జాండర్ ఒవెచ్కిన్ ప్రకటన తూర్పు గంగవరంలో వరుణ యాగం పాల్గొననున్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి లాకర్‌బీ బాంబ్ పేలుడు కేసులో 2027 జనవరికి అమెరికా కోర్టు విచారణ ఖరారు యూకే ఆన్‌లైన్ సేఫ్టీ నిబంధనలపై మెటా, టిక్‌‌టాక్, ఎక్స్ న్యాయపోరాటం

రేపు

Select Suryaa Now
రేపు
  • తోటపల్లి ఆలయాల ఈవో వి వి సూర్యనారాయణ వెల్లడి
  • వరుణ దేవుని ఆశీస్సులు పొందేందుకు వరుణ యాగం
  • భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలి ఈ వో సూర్యనారాయణ

గరుగుబిల్లి: వర్షాభావ పరిస్థితులను నివారించి సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని,నదులు జలకళతో పరవళ్ళు తొక్కాలని,అదే విధంగా రైతాంగం సుభిక్షంగా ఉండాలన్న సంకల్పంతో ఉత్తరాంధ్రలో చిన తిరుపతిగా ప్రసిద్ధి చెందిన గరుగుబిల్లి మండలం తోటపల్లి శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 6 వ తేదీన వేద పండితులతో వరుణ యాగము మరియు వరుణ జపం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని తోటపల్లి శ్రీవెంకటేశ్వరస్వామి మరియు కోదండరామస్వామి ఆలయాల కార్యనిర్వహణ అధికారి వి వి సూర్యనారాయణ వెల్లడించారు.ఈమేరకు తోటపల్లి శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం స్థానిక విలేకరులతో దేవస్థానం కార్య నిర్వహణ అధికారి వి వి సూర్యనారాయణ మాట్లాడారు.ఈఏడాది వర్షాలు తక్కువగా ఉన్నందున సమృద్ధిగా వర్షాలు కురిసేందుకు మరియు రాష్ట్ర దేశ ప్రజల సంక్షేమం మరియు శ్రేయస్సు కొరకు వరుణ దేవుని ఆశీస్సులను పొందేందుకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వరుణ యాగము మరియు వరుణ జపం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు.తోటపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ఉదయం 6.54 గంటల నుంచి వేద పండితులచే వరుణ యాగము మరియు వరుణ జపం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కార్య నిర్వహణ అధికారి వి వి సూర్యనారాయణ పేర్కొన్నారు.