BREAKING
పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను అభినందించిన వరంగల్ సిపి శ్రీ పద్మాక్షి దేవాలయ శరన్నవరాత్రి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ దంపతుల కొత్త సినిమా 'తూ హై మేరీ కిరణ్' ట్రైలర్ విడుదల! జాతీయ అవార్డు గ్రహీత చంద్రకళకు పోలీస్ శాఖ సత్కారం గ్రామీణ ప్రజలకు వైద్యం మరింత చేరువ: ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఎస్పీ బాలుతో ఆ జ్ఞాపకం ఇప్పటికీ మరువలేను.. ఎస్వీ కృష్ణా రెడ్డి ఎమోషనల్ పోస్ట్! చెత్తను సద్వినియోగం చేసుకోవాలి ఆశావర్కర్స్కు కనీసవేతనాలు చెల్లించాలి. అయోడిన్ లోప రుగ్మతల నియంత్రణకు జిల్లా స్థాయి సర్వే.. ఎముకల ఆరోగ్యం: వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు దృఢంగా ఉండాలంటే రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రొటీన్ లోపం రాకుండా ఉండాలంటే రోజువారీ మన శరీరానికి ఎంత ప్రొటీన్ అవసరమో తెలుసా? ఐరన్ లోపం: శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గి అలసట, తల తిరగడానికి అసలు కారణం ఏమిటో తెలుసా? కరీనా షోలో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌‌పుత్.. ఆ యాడ్ వివాదంపై కృతి సనన్ షాకింగ్ కామెంట్స్! లక్ష్మీపోలవరంలో అంగన్వాడీ ఉత్సవ్ ప్రజలకు శుభ్రమైన తాగునీరు అందేలా చర్యలు

గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో సందడే సందడిగా అంగన్వాడీ ఉత్సవం

Select Suryaa Now
గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో సందడే సందడిగా అంగన్వాడీ ఉత్సవం

గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో సందడే సందడిగా అంగన్వాడి ఉత్సవం 
ఆత్మకూరు, మేజర్ న్యూస్, సోమా వెంకటసుబ్బయ్య : ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో సోమవారం అంగన్వాడీ ఉత్సవం కార్యక్రమాన్ని అత్యంత కోలాహాలంగా సందడే సందడిగా నిర్వహించారు. ఐసిడిఎస్ ఆత్మకూరు ప్రాజెక్టు సిడిపిఓ పి. సునీలత పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. మండలంలోని చెర్లో యడవల్లి అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్త ఎస్. విజయమ్మ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు. బి. చిరువెళ్ల అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడి కార్యకర్త కే.దేవసేనమ్మ ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉత్సవం కార్యక్రమాన్ని కోలాహాలంగా నిర్వహించారు. మండలంలోని నారంపేట అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్త లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉత్సవం కార్యక్రమాన్ని అత్యంత ఆకర్షణీయంగా ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహార ప్రదర్శనలు, గర్భిణీలకు సీమంతం కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవంను పురస్కరించుకొని అంగన్వాడీ కేంద్రాలను ఆకర్షణీయంగా అలంకరించారు.ఐసీడిఎస్ సేవలను అందరికీ వివరించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐ సి డి ఎస్ సూపర్వేజర్ జి. కస్తూరి,అంగన్వాడీ కార్యకర్తలు ఎస్. విజయమ్మ, కే. దేవసేనమ్మ, లక్ష్మీ ప్రసన్న,ఆయా అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని గర్భిణీలు, బాలింతలు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.