BREAKING
సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ దంపతుల కొత్త సినిమా 'తూ హై మేరీ కిరణ్' ట్రైలర్ విడుదల! జాతీయ అవార్డు గ్రహీత చంద్రకళకు పోలీస్ శాఖ సత్కారం గ్రామీణ ప్రజలకు వైద్యం మరింత చేరువ: ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఎస్పీ బాలుతో ఆ జ్ఞాపకం ఇప్పటికీ మరువలేను.. ఎస్వీ కృష్ణా రెడ్డి ఎమోషనల్ పోస్ట్! చెత్తను సద్వినియోగం చేసుకోవాలి ఆశావర్కర్స్కు కనీసవేతనాలు చెల్లించాలి. అయోడిన్ లోప రుగ్మతల నియంత్రణకు జిల్లా స్థాయి సర్వే.. ఎముకల ఆరోగ్యం: వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు దృఢంగా ఉండాలంటే రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రొటీన్ లోపం రాకుండా ఉండాలంటే రోజువారీ మన శరీరానికి ఎంత ప్రొటీన్ అవసరమో తెలుసా? ఐరన్ లోపం: శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గి అలసట, తల తిరగడానికి అసలు కారణం ఏమిటో తెలుసా? కరీనా షోలో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌‌పుత్.. ఆ యాడ్ వివాదంపై కృతి సనన్ షాకింగ్ కామెంట్స్! లక్ష్మీపోలవరంలో అంగన్వాడీ ఉత్సవ్ ప్రజలకు శుభ్రమైన తాగునీరు అందేలా చర్యలు విదేశాలకు వెళ్లే ముందు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి.. జిల్లా కలెక్టర్ డా. మహేష్ కుమార్ లో బ్రిడ్జి వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన బీజేపీ నేతలు

Select Suryaa Now
జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన బీజేపీ నేతలు

 


యాదగిరిగుట్ట మేజర్ న్యూస్.....

యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో అక్రమ డోర్ నంబర్ల కేటాయింపుపై చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ కి వినతిపత్రం అందజేసిన బీజేపీ నేతలు  
యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని యాదగిరిపల్లి వద్ద ఎలాంటి భవన నిర్మాణాలు జరగకపోయినా, నాలా  కన్వర్షన్ అనుమతులు లేకపోయినా అక్రమంగా డోర్ నంబర్లు కేటాయించిన మున్సిపల్ కమిషనర్ బార్ల శ్రీనివాస్ మరియు సంబంధిత అధికారులపై తక్షణమే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ బిజేపి నాయకులు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బిజేపి స్టేట్ కౌన్సిల్ మెంబర్ రచ్చ శ్రీనివాస్ మాట్లాడుతూ...
మున్సిపల్ పరిధిలోని యాదగిరిపల్లి వద్ద ఖాళీ స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు లేకున్నా, 300 చదరపు అడుగుల భవనాలు ఉన్నట్లు చూపుతూ నిబంధనలకు విరుద్ధంగా ఇంటి పన్ను అసెస్మెంట్ చేసి డోర్ నంబర్లు (13-285/5/A/A/1, 13-285/5/A/A/3, 13-285/5/A/A/2) కేటాయించారని మండిపడ్డారు. మున్సిపల్ కమిషనర్ స్థల పరిశీలన చేయకుండా, తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరించి ఈ అక్రమ కేటాయింపులకు పాల్పడ్డారని విమర్శించారు. ఎలాంటి అనుమతులు లేకుండా కేటాయించిన సదరు డోర్ నంబర్లను వెంటనే రద్దు చేయాలని మరియు మున్సిపల్ కమిషనర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  
మున్సిపాలిటీలో అక్రమాలకు పాల్పడుతూ ప్రజల సొత్తును, ప్రభుత్వ ఆదాయాన్ని గండికొట్టే అధికారులను ఉపేక్షించేది లేదన్నారు. ఎలాంటి పర్మిషన్లు లేకుండా డోర్ నంబర్లు ఇవ్వడం వెనుక పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, దీనిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కర్రె ప్రవీణ్ కుమార్ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఆకుల చంద్రమౌళి, పట్టణ ప్రధాన కార్యదర్శులు నరేష్, సురేష్, ఉపాధ్యక్షులు ఆలేటి కర్ణ, ఓబీసీ జిల్లా కార్యదర్శి దోమట ప్రభాకర్, బి జె వై ఎం  పట్టణ ప్రధాన కార్యదర్శి దేవ, విజయ్ శ్యాం, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.