BREAKING
ఆర్డీవో కార్యాలయం ముందు పిడిఎస్యు విద్యార్థి సంఘం ధర్నా యూత్‌ను ఉర్రూతలూగించేందుకు వస్తోన్న హుషారు 2... కల్ట్ సీక్వెల్ అనౌన్స్‌మెంట్ ఓటర్ల జాబితా ప్రక్షాళనలో పారదర్శకతే ప్రజాస్వామ్యానికి బలం: డా శివ ప్రసాద్ కమిషనర్ తీరుపై అధికార, ప్రతిపక్షాల అసంతృప్తి….! నారాయణపేట మైనార్టీ స్కూల్ ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలి ఇటలీలో ఉద్యోగ కోతలు, బలవంతపు తొలగింపులు లేవని ట్రేడ్ యూనియన్ల వెల్లడి నేడు నారాయణపేట కలెక్టరేట్ ముట్టడి టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు సేవకు గుర్తింపు… సర్పంచ్ బందయ్యకు జాతీయ పురస్కారం..! స్టార్స్‌బక్స్‌కు చుక్కెదురు యూకే, ఇజ్రాయెల్ మధ్య తీవ్రమవుతున్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు హాకీ చరిత్రలో 2026-27 సీజనే తన చివరిదంటూ అలెగ్జాండర్ ఒవెచ్కిన్ ప్రకటన తూర్పు గంగవరంలో వరుణ యాగం పాల్గొననున్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి లాకర్‌బీ బాంబ్ పేలుడు కేసులో 2027 జనవరికి అమెరికా కోర్టు విచారణ ఖరారు యూకే ఆన్‌లైన్ సేఫ్టీ నిబంధనలపై మెటా, టిక్‌‌టాక్, ఎక్స్ న్యాయపోరాటం

గ్రీవెన్స్ అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం

Select Suryaa Now
గ్రీవెన్స్ అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం

 గ్రీవెన్స్ అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం      = డిఆర్ఓ  పి.వి.రమణ

 సూర్య, ఒంగోలు  :        

 ​ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి, నిర్ణీత కాలవ్యవధిలో పారదర్శకంగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి (DRO) పి.వి.రమణ ఆదేశించారు. ​సోమవారం కలెక్టరేట్ లోని గ్రీవెన్స్ హాలులో నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' కార్యక్రమంలో ఆయన పాల్గొని, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వయంగా స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 303 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా డి.ఆర్.ఓ మాట్లాడుతూ, సోమవారం గ్రీవెన్స్ కు వచ్చే అర్జీదారుల సమస్యలను క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా మాత్రమే శాశ్వతంగా పరిష్కరించగలమని పేర్కొన్నారు. అర్జీలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా చట్టపరిధిలో నాణ్యమైన పరిష్కారం లభించేలా చూసే బాధ్యత అధికారులపైనే ఉందన్నారు. ఒకసారి సమర్పించిన అర్జీలు మళ్లీ మళ్లీ అదే సమస్యపై రాకుండా చూడాలని, మొదటిసారే సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి అర్జీదారులకు స్పష్టమైన, సంతృప్తికరమైన పరిష్కారం అందించాలని ఉద్ఘాటించారు. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా అర్జీలు పెండింగ్‌‌లో పడకూడదని సూచించారు. క్షేత్రస్థాయి సిబ్బందికి జిల్లా అధికారులు తగిన మార్గదర్శకత్వం చేస్తూ, అర్జీల పరిష్కార ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ​ఈ కార్యక్రమంలో జిల్లా విపత్తు నిర్వహణ అధికారి మాధురి, జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, జిల్లా పంచాయతీ అధికారి అనుపమ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతిలతో పాటు పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.