BREAKING
ఆర్డీవో కార్యాలయం ముందు పిడిఎస్యు విద్యార్థి సంఘం ధర్నా యూత్‌ను ఉర్రూతలూగించేందుకు వస్తోన్న హుషారు 2... కల్ట్ సీక్వెల్ అనౌన్స్‌మెంట్ ఓటర్ల జాబితా ప్రక్షాళనలో పారదర్శకతే ప్రజాస్వామ్యానికి బలం: డా శివ ప్రసాద్ కమిషనర్ తీరుపై అధికార, ప్రతిపక్షాల అసంతృప్తి….! నారాయణపేట మైనార్టీ స్కూల్ ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలి ఇటలీలో ఉద్యోగ కోతలు, బలవంతపు తొలగింపులు లేవని ట్రేడ్ యూనియన్ల వెల్లడి నేడు నారాయణపేట కలెక్టరేట్ ముట్టడి టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు సేవకు గుర్తింపు… సర్పంచ్ బందయ్యకు జాతీయ పురస్కారం..! స్టార్స్‌బక్స్‌కు చుక్కెదురు యూకే, ఇజ్రాయెల్ మధ్య తీవ్రమవుతున్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు హాకీ చరిత్రలో 2026-27 సీజనే తన చివరిదంటూ అలెగ్జాండర్ ఒవెచ్కిన్ ప్రకటన తూర్పు గంగవరంలో వరుణ యాగం పాల్గొననున్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి లాకర్‌బీ బాంబ్ పేలుడు కేసులో 2027 జనవరికి అమెరికా కోర్టు విచారణ ఖరారు యూకే ఆన్‌లైన్ సేఫ్టీ నిబంధనలపై మెటా, టిక్‌‌టాక్, ఎక్స్ న్యాయపోరాటం

జయప్రకాష్ కు గౌరవ డాక్టరేట్

Select Suryaa Now
జయప్రకాష్ కు గౌరవ డాక్టరేట్

జయప్రకాష్ కు గౌరవ డాక్టరేట్. 
--పీఎంపీ అసోసియేషన్ అభినందన
ఆత్మకూరు, మేజర్ న్యూస్, సోమా వెంకటసుబ్బయ్య :
కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, (ది పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా) రూడ్స్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం, డైకస్ రోడ్డు సెంటర్లోని రూడ్స్ కార్యాలయం నందు గౌరవ డాక్టరేట్ పొందిన అనుముల జయప్రకాష్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా పిఎంపి అధ్యక్షులు శాఖవరపు వేణుగోపాల్ మాట్లాడుతూ యువతకు స్వయం ఉపాధి రంగంలో అవగాహన కల్పించడంతోపాటు ప్రభుత్వ అవకాశాలను తెలియజేసేందుకు సుదీర్ఘకాలం కృషిచేసిన అనుముల జయప్రకాష్ కు  అమెరికాకు చెందిన గ్లోబల్ పీస్ సమ్మిట్ వారు ఇటీవల చెన్నై, ఆంధ్రక్లబ్ లో గౌరవ డాక్టరేట్ అందజేశారని, నిరుద్యోగులకు అవసరమైన స్వయం ఉపాధి పథకాలు, ఉపాధి శిక్షణ, మార్గదర్శి మహిళలకు ఉపాధి అవకాశాలు ఇలాంటి ఎన్నో పుస్తకాలు రచించి, స్వయం ఉపాధి పథకాలను విస్తృతంగా ప్రచారం చేశాడని, యువజన నాయకుడిగా, సుదీర్ఘకాలం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ నాయకుడిగా, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ఉపాధ్యక్షుడిగా, గ్రామీణ వైద్యులైన పి.ఎం.పి అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షులుగా  అందరికీ పరిచయమైన వ్యక్తి ఏ.జయప్రకాష్ అని ఆయన కొనియాడారు. అతను చేసిన నిస్వార్ధ సేవకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ అందుకోవడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూడ్స్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ షేక్ రసూల్, నెల్లూరు డివిజన్ పి.యం.పి అధ్యక్ష కార్యదర్శులు గోరంట్ల శేషయ్య, దేవరకొండ శ్రీనివాసులు, ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు కుడుముల సుబ్బారావు, బి.భారతి, డి.శ్రీధర్ రావు, విశ్రాంత ఏఎస్ఐ మహబూబ్బాషా, హాస్పిటల్స్ కోఆర్డినేటర్ కొండాపురం వెంకటేశ్వర్లు, కె.వసుంధర, జి.నాగచంద్రిక, షేక్ ఖాసిం, తదితరులు పాల్గొన్నారు.