భువనగిరిలో జిల్లాస్థాయి నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్
*జాతీయ స్థాయి లో జిల్లా కు పేరు ప్రఖ్యాతులు తేవాలి*..
*మున్సిపల్ వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు*
*భువనగిరి ప్రతినిధి మేజర్ న్యూస్*
*జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్ పోటీలను ఆదివారం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించారు. భువనగిరి మున్సిపల్ వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై, పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ క్రీడాంశాలలో అథ్లెట్లకు పోటీలు నిర్వహించారు.
తదనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు పోతoశెట్టి వెంకటేశ్వర్లు అధ్యక్షతన అందజేశారు.పోటీలలో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు అతిథుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, మెడల్స్ అందజేశారు.
ఈ పోటీలలో జిల్లా వ్యాప్తంగా దాదాపు 200 నుండి 250 మంది క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక్కడ ప్రతిభ చూపి ఎంపికైన క్రీడాకారులను రాబోయే నవంబర్ మాసంలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు పంపించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కోనేటి గోపాల్, అథ్లెక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పర్యవేక్షకులు ఎం పవన్ కుమార్ ఉపాధ్యక్షులు కె.వి. రమణ, సంయుక్త కార్యదర్శి అంబోజు అనిల్ కుమార్, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు రఘువీర్ సింగ్, పవన్ కుమార్, సునీల్, సుమలత, అఖిల్, అనిత, శివాని శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు*.