చీపురుపల్లిలో జనసేనలోకి చేరికలు
చీపురుపల్లి మేజర్ న్యూస్:
జనసేన పార్టీ లోకి వలసలు ప్రారంభమయ్యాయి. వైసీపీ కీలక నేత మజ్జి శ్రీనివాసరావు టీడీపీలో చేరడంతో వైసీపీ క్యాడర్ లో కదలికలు ప్రారంభమయ్యాయి. కొంతమంది టీడీపీలో చేరితే మరికొందరు పవన్ కళ్యాణ్ పై అభిమానంతో జనసేన తీర్థం పుచ్చుకుంటున్నారు. మండలంలోని దేవరపొదిలం గ్రామంలో 50 కుటుంబాలు, గరివిడి మండలం దేవాడ గ్రామం నుంచి 10 కుటుంబాలు ఆదివారం జనసేనలో చేరారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన భారీ చేరికల కార్యక్రమం వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు, రాష్ట్ర అభివృద్ధికి ఆకర్షితులై వారంతా జనసేన పార్టీలో చేరారు. నియోజకవర్గ ఇంచార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు సమక్షంలో వారందరికీ పార్టీ కండువాలు వేసి ఘనంగా పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ఇటీవల జరిగిన స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఎన్నికల్లో చైర్మన్లుగా, వైస్ చైర్మన్లుగా గెలుపొందిన నాయకులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పార్టీ రోజురోజుకూ బలోపేతం అవుతోంది, ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.