BREAKING
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి బుర్రా జయవర్ధన్ రెడ్డి ఎదురెదురుగా రెండు లారీలు ఢీ అపహాస్యంగా గ్రామసభలు? రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేయాలి మీ ఓటు.. మీ హక్కు.. మీ భవిష్యత్‌కు బలం..! సాఫ్ట్‌బాల్ జిల్లా స్థాయి ఎంపికలు ఓం శక్తి అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు విచ్చేయండి శిష్టకరణం నూతన కార్యవర్గం ఎన్నిక గౌడ సంఘాన్ని మరింత పటిష్టం చేస్తాం* వాలి చర్ల విద్యా కమిటీ చైర్మన్ గా రెండోసారి సయ్యద్ చిన కాసింవలి హోర్ముజ్ జలసంధి గుండా 20 లక్షల బ్యారెళ్ల ముడి చమురును రవాణా చేసిన ఇరాక్ 2021 ఫలితాలు పునరావృతం కావాలి. దివ్యాంగుల ఆత్మగౌరవానికి అండగా ఉంటాం స్థానిక ఎన్నికల సమరానికి బిజెపి శ్రేణులు సిద్ధంగా ఉండాలి మండల బిజెపి అధ్యక్షుడు యర్ర విక్రమ్ పిలుపు మొక్కలు నాటిన ఎంపీడీవో

గడప గడపకు సంక్షేమ పథకాలు: రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి

Select Suryaa Now
గడప గడపకు సంక్షేమ పథకాలు: రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి

---గడప గడపకు సంక్షేమ ఫలాలు… రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

---216 మంది లబ్ధిదారులకు రూ. 1,02,51,000 విలువ గల సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన మంత్రి

ఖమ్మం, (సూర్య బ్యూరో):

గడప గడపకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక శ్రీ శ్రీ సర్కిల్ వద్ద గల తన నివాసంలో ఖమ్మం రూరల్, ఎదులాపురం మునిసిపాలిటీ పరిధిలోని 216 మంది లబ్ధిదారులకు ఒక కోటి 2 లక్షల 51 వేల రూపాయల విలువగల చెక్కులను పంపిణీ చేశారు. ఇందులో ఖమ్మం రూరల్ మండలానికి చెందిన 51 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 70 మంది, ఖమ్మం రూరల్ మండలం పరిధిలోని 95 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆపదలో ఉన్న ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, పేదల కన్నీళ్లు తుడవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నిరుపేదలకు వైద్య ఖర్చుల భారం కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధిని వేగంగా అందిస్తున్నామన్నారు. అలాగే ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణలక్ష్మి పథకం ఎంతో ఆసరాగా నిలుస్తోందని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా చర్యలు చేపట్టామన్నారు. 
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు