BREAKING
*నాటక రంగానికి పూర్వవైభవం:సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరంలో జక్కంపూడి బర్త్‌డే సందడి మహాలక్ష్మి పథకానికి ఆడపడచుల నీరాజనాలు వైష్ణవ్ తేజ్ కెరీర్‌లో అత్యంత కీలకంగా మారిన తదుపరి సినిమా మూడేళ్ల విరామం తర్వాత సక్సెస్ కోసం తీవ్ర ప్రయత్నాలు గుంతలమయంగా కానూరు– కాపవరం రహదారి డీజీపీ నీ కలిసిన ఉప్పల్ MLA బండారి లక్ష్మారెడ్డి ప్రతి పేదవాడి సొంతింటి కల నిజం చేస్తాం: గంటా గోకవరంలో ఆపరేషన్ త్రిశూల్‌ 3కె రన్ పద్మనాభం మండలంలో రూ.15 కోట్ల అభివృద్ధి పనులకు భూమిపూజ ఓటీటీని షేక్ చేస్తున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్: సీన్ సీన్‌కు మైండ్ బ్లాంక్ చేసే ట్విస్టులు! గంటాకు పాలాభిషేకం చేసిన నగేష్ కుమార్ చిప్పిలి సమ్మర్ స్టోరేజీని నింపి మదనపల్లె ప్రజల దాహార్తిని తీర్చాలి జాతీయ స్థాయి రోల్ ప్లే, జానపద నృత్య పోటీలు కు సంసిద్ధం కావాలి.. సేవా కార్యక్రమాలతో దబ్బని వెంకట్ జన్మదిన వేడుకలు అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం. దర్శి సి ఐ

ఎదురెదురుగా రెండు లారీలు ఢీ

Select Suryaa Now
ఎదురెదురుగా రెండు లారీలు ఢీ

తప్పిన ప్రాణ నష్టం

పెనుబల్లి సూర్య మేజర్ న్యూస్....

మండాలపాడు గ్రామ శివారులో  లంక సాగర్ క్రాస్ రోడ్ వద్ద రెండు లారీలు ఢీ కొట్టుకొని బీభత్సం సృష్టించడంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులు చెందారు. పెనుబల్లి మండలం మండాలపాడు గ్రామ శివారులోని లంకా సాగర్ క్రాస్ రోడ్ వద్ద సత్తుపల్లి వైపు నుండి విఎం బంజర వైపుకు వస్తున్న దొడ్ల డైరీ పాల డీసీఎం కంటైనర్, సత్తుపల్లి వైపు వెళుతున్న బొగ్గు టిప్పర్ లారీ ఎదురెదురుగా ఢీ కొట్టుకున్నాయి. ఈ ఘటనలతో పాల వ్యాను క్లీనర్ కి గాయాలు అయ్యాయి. పాల వాహనము డ్రైవరు బొగ్గు టిప్పర్ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో రెండు లారీల క్యాబిన్ లు ధ్వంసం అయ్యాయి. రహదారిపై ఉన్న గొయ్యను తప్పించే క్రమంలో  బొగ్గు టిప్పర్ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న పాలవాహానాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు వివరించారు. ఈ ప్రమాదంలో గాయాలతో బయటపడి ప్రాణనాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గాయపడ్డ పాలవాహన క్లీనర్ సత్తెనపల్లి కి చెందిన వేట కోటిరెడ్డిగా గుర్తించారు. అటనా స్థలానికి చేరుకున్న విఎం బంజర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుడుని పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.