BREAKING
బాల న్యాయ వ్యవస్థపై పోలీసులకు అవగాహన పోరంకి–కానూరుకు రూ.34.92 కోట్ల అభివృద్ధి పనులు.. తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు...జనతా పరివార్ పార్టీ అభ్యర్థుల ప్రకటన అభివృద్ధిని చూసి వైసీపీకి కడుపుమంట.. అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌.. రూ.5 లక్షల సొత్తు, రెండు కార్లు స్వాధీనం ఇంట్లో ఇనుపరాడ్‌తో భార్యపై దాడి మేయర్‌గా బొండా సిద్ధార్థకు అవకాశం కల్పించాలి వైభవంగా విజయవాడ ఉత్సవ్–2.. జాతీయస్థాయి కుంగ్ ఫూ కరాటే పోటీల్లో శ్రీ సత్య విద్యానికేతన్ విద్యార్థుల ప్రతిభ. గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి పల్లె పండుగ 3.0తో పల్లెలకు మహర్దశ - పి.గన్నవరంలో రూ.4.30 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గిడ్డి శంకుస్థాపన పత్తి రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తెకు ఎమ్మెల్సీ పదవి? తండ్రి అడుగుజాడల్లో తనయుడు.. జక్కంపూడి రాజా సేవా స్ఫూర్తి గరివిడి లక్ష్మి ట్రైలర్ విడుదల, జానపద బయోపిక్‌లో అదరగొట్టిన ఆనంది, ఆకట్టుకుంటున్న విజువల్స్

పద్మనాభం మండలంలో రూ.15 కోట్ల అభివృద్ధి పనులకు భూమిపూజ

Select Suryaa Now
పద్మనాభం మండలంలో రూ.15 కోట్ల అభివృద్ధి పనులకు భూమిపూజ

పద్మనాభం: కూటమి ప్రభుత్వంలో పద్మనాభం మండలం అభివృద్ధి పరుగులు పెడుతోంది. మండలంలోని వివిధ గ్రామాల్లో రూ.15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, బీటీ రోడ్ల నిర్మాణ పనులకు మంగళవారం ఘనంగా శంకుస్థాపనలు చేశారు.పద్మనాభం మండల టీడీపీ అధ్యక్షులు కోరాడ రమణ చేతుల మీదుగా ఈ పనులకు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన గ్రామీణ రోడ్లను కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేస్తోందని అన్నారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సహకారంతో మండలంలోని ప్రతి గ్రామానికి నిధులు తీసుకొస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కసిరెడ్డి దామోదరరావు, క్లస్టర్ ఇంచార్జ్ కె. రామరాజు, టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామాల సర్పంచ్ లు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.