గుంతలమయంగా కానూరు– కాపవరం రహదారి
పెరవలి మేజర్ న్యూస్ : నిడదవోలు నుంచి నర్సాపురం వెళ్లే ప్రధాన రహదారిలో పెరవలి మండల పరిధిలో కానూరు నుంచి కాపవరం వరకు రహదారి పూర్తిగా గుంతలమయమై అధ్వానంగా తయారైందని, వెంటనే మరమ్మతులు చేపట్టి వాహనదారుల ఇబ్బందులను తొలగించాలని కోరుతూ బీఎస్పీ నాయకులు అక్టోబర్ 5వ తేదీ సోమవారం పెరవలి డిప్యూటీ తహసిల్దార్ కే సన్నిబాబు కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా బీఎస్పీ నాయకులు మాట్లాడుతూ కానూరు నుంచి కాపవరం వరకు రహదారి దెబ్బతినడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు
. ఈ రహదారిపై ప్రయాణించాలంటే వాహనదారులు భయపడే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.రహదారిపై వాహనాలు ప్రయాణించే సమయంలో పెద్దఎత్తున దుమ్ము లేచి వాహనదారుల కళ్లలో పడుతోందని, దీంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు సిర్రా రాజు, బద్దా జాన్, గొల్ల ధనరాజు, మోర్త చింతరాజు, బద్దా శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.