మాజీ కౌన్సిలర్ తుడుం గణేష్ జన్మదిన వేడుకలు
మేడ్చల్, మేజర్ న్యూస్( అక్టోబర్ 5):పూడూరు–కిష్టాపూర్ కార్పొరేషన్ పరిధిలోని కిష్టాపూర్‌లో మాజీ కౌన్సిలర్ తుడుం గణేష్ జన్మదిన వేడుకలను బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి గణేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తుడుం గణేష్‌కు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు డి. నరేష్, మంత్రి కుమార్, సాయి గౌడ్, కాశి, సూరిబాబు, హలీం తదితరులు పాల్గొని గణేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
రిపోర్టర్ తలారి శివకుమార్.