BREAKING
బాల న్యాయ వ్యవస్థపై పోలీసులకు అవగాహన పోరంకి–కానూరుకు రూ.34.92 కోట్ల అభివృద్ధి పనులు.. తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు...జనతా పరివార్ పార్టీ అభ్యర్థుల ప్రకటన అభివృద్ధిని చూసి వైసీపీకి కడుపుమంట.. అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌.. రూ.5 లక్షల సొత్తు, రెండు కార్లు స్వాధీనం ఇంట్లో ఇనుపరాడ్‌తో భార్యపై దాడి మేయర్‌గా బొండా సిద్ధార్థకు అవకాశం కల్పించాలి వైభవంగా విజయవాడ ఉత్సవ్–2.. జాతీయస్థాయి కుంగ్ ఫూ కరాటే పోటీల్లో శ్రీ సత్య విద్యానికేతన్ విద్యార్థుల ప్రతిభ. గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి పల్లె పండుగ 3.0తో పల్లెలకు మహర్దశ - పి.గన్నవరంలో రూ.4.30 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గిడ్డి శంకుస్థాపన పత్తి రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తెకు ఎమ్మెల్సీ పదవి? తండ్రి అడుగుజాడల్లో తనయుడు.. జక్కంపూడి రాజా సేవా స్ఫూర్తి గరివిడి లక్ష్మి ట్రైలర్ విడుదల, జానపద బయోపిక్‌లో అదరగొట్టిన ఆనంది, ఆకట్టుకుంటున్న విజువల్స్

ప్రతి పేదవాడి సొంతింటి కల నిజం చేస్తాం: గంటా

Select Suryaa Now
ప్రతి పేదవాడి సొంతింటి కల నిజం చేస్తాం: గంటా

భీమిలి: రాబోయే మూడేళ్లలో ప్రతి పేదవాడికి సొంతింటి కల నిజం చేస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఎంపీడీఓ కార్యాలయం సమావేశం మందిరంలో సోమవారం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో రూ.8,874 కోట్ల విలువైన భూమిని 28 వేల మందికి ఇళ్ల పట్టాల రూపంలో అందించామని, భీమిలి నియోజకవర్గంలో పంపిణీ చేసిన భూమి విలువ రూ.886 కోట్లుగా పేర్కొన్నారు. గత నెల 19న విశాఖలో, 23న విజయవాడలో కలిపి 52 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలను ఇచ్చామన్నారు. ఈనెల 4 న 3 డి కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్ లు శ్రీకారం చుట్టారని చెప్పారు. శాశ్వత హక్కులతో ఇచ్చిన స్థలాన్ని అమ్ముకోకుండా నివాసం ఉంటేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరినట్టన్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమాన్ని అందిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఈనెల 19 న సీఎం చేతుల మీదుగా పట్టాలు తీసుకోని 79 మంది లబ్ధిదారులకు తన చేతుల మీదుగా అందిస్తున్నానని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ సంగీత్ మాధుర్, ఎమ్మార్వో రామారావు, ఎంపీడీఓ నగేష్, భీమిలి నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ చిక్కాల విజయ్ బాబు, గాడు చిన్ని కుమారి లక్ష్మి, గంటా నూకరాజు, గొలగాని నరేంద్ర, గరే సదానంద, తమ్మిన సూరిబాబు, పాసి నరసింగరావు, జీరు సత్యం,కనకల అప్పలనాయుడు, దండి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.