BREAKING
నో యువర్ లీడర్’ సమనస జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని భవ్య శ్రీ.. పరిమళ ప్రసాదం కొరత తీర్చేందుకు మెగా ప్రాజెక్టు ప్రజా సమస్యలపై అధికారులు ప్రత్యేక సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి..జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.. 17వ డివిజన్‌లో అదరగొట్టిన ఫ్లాష్ మాబ్స్.. - విజయవాడ ఉత్సవ్ 2.0కు విస్తృత ప్రచారం ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తిస్థాయిలో పరిష్కరించాలి సాంప్రదాయ విలువలను భావితరాలకు అందించాలి : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ దసరా విశేష సేవల ఆన్‌లైన్ టికెట్లు విడుదల దసరా ఏర్పాట్లపై దేవాదాయ కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలన పేద కుటుంబాలకు అండగా నిలుస్తాం.. సమాజ సేవకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి బీసీలకు న్యాయం జరిగేలా రిజర్వేషన్లు నేటి రాశి ఫలాలు: 6 అక్టోబర్ 2026 (మంగళవారం) రాజ్‌కుమార్ సేవా స్ఫూర్తి చిరస్మరణీయం : ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు నేటి పంచాంగం: 6 అక్టోబర్ 2026 (మంగళవారం) ఖరీఫ్ ధాన్యం సేకరణకు పటిష్ట ప్రణాళిక 6, 7, 8 తేదీల్లో సేవా సేతు అభియాన్ క్యాంపులు

గోకవరంలో ఆపరేషన్ త్రిశూల్‌ 3కె రన్

Select Suryaa Now
గోకవరంలో ఆపరేషన్ త్రిశూల్‌ 3కె రన్

గోకవరం, మేజర్ న్యూస్ :గోకవరంలో ఆపరేషన్ త్రిశూల్‌ అవగాహన 3కె రన్ సోమవారం పోలీసులు నిర్వహించారు. డ్రగ్స్,  రోడ్డు ప్రమాదాల నివారణ, మహిళలు, బాలల భద్రత ప్రధాన లక్ష్యంగా ఉత్తర మండలం డిఎస్పీ సిహెచ్. జీవన ఆధ్వర్యంలో ఈకార్యక్రమాన్ని నిర్వహించారు. 

ఈ సందర్బంగా ఆపరేషన్ త్రిశూల్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ ఆదేశాల మేరకు ఉత్తర మండలం డీఎస్పీ సిహెచ్. జీవన ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 7 గంటలకు కోరుకొండ సిఐ ఎస్వీవీఎన్ మూర్తి పర్యవేక్షణలో గోకవరం ఎస్సై లు వి.ఎన్.వి. పవన్ కుమార్, బి.నాగమణి కొరుకొండ సర్కిల్ పోలీస్ స్టేషన్ల సిబ్బంది, ప్రజలు, యువకుల భాగస్వామ్యంతో గోకవరం ధరణి ఫంక్షన్ హాల్ నుంచి గోకవరం బస్టాండ్ వరకు 3కె రన్  నిర్వహించారు

. అనంతరం   బస్టాండ్ లో మానవహారం చేసారు. డీఎస్పీ సిహెచ్. జీవన  ప్రజలు, పోలీసు సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆపరేషన్ త్రిశూల్ 3 ప్రధాన లక్ష్యాలైన డ్రగ్స్ నివారణ, మహిళలు మరియు బాలల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు వివరించారు. ఈ  కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యులై లక్ష్యాలను సాధించాలని ఆమె కోరారు.అనంతరం ఆమె త్రిశూల్ లక్ష్యాలు అందరి బాధ్యత అని అందరితో ప్రతిజ్ఞ చేయించారు.1. మహిళల భద్రత – మన బాధ్యత 2. డ్రగ్స్ వద్దు – ఫిట్‌నెస్ ముద్దు
3. ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దాం – రోడ్డు ప్రమాదాలను అరికడదాం అనే స్లొగన్స్ అందరితో చెప్పించారు.