BREAKING
ఇక చాలు బాబోయ్.. డేట్ నైట్స్‌పై బాలీవుడ్ క్యూట్ జోడి కియారా అద్వానీ ఆసక్తికర వ్యాఖ్యలు! లాహోర్‌లో రికార్డు స్థాయి వాయు కాలుష్యం: ఉక్కిరిబిక్కిరి ఇష్టం లేకుండా భార్యాభర్తలుగా కొనసాగడం వేస్ట్.. పెళ్లి, విడాకులపై దర్శకుడు తరుణ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు! అబుదాబిలో రష్యా–ఉక్రెయిన్ శాంతి చర్చలు: అమెరికా మధ్యవర్తిత్వం అప్పుడు సమంత.. ఇప్పుడు పవన్ కళ్యాణ్.. వేణుస్వామి చెప్పిన పాత జోస్యం నెట్టింట వైరల్! జన్మదిన వేళ.. కేటీఆర్ ఆశీస్సులు* *మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కుమార్తెకు కేటీఆర్ ఆత్మీయ శుభాకాంక్షలు అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు డౌన్: దౌత్య చర్చల్లో పురోగతి ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ విడుదల: 720 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం! డీప్ ఫేక్ బారిన పడ్డ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.. నెట్టింట వైరల్ అవుతున్న మార్ఫింగ్ వీడియో! ఏపీలో వెబ్‌ల్యాండ్‌ రికార్డుల ట్యాంపరింగ్‌ ముఠా గుట్టురట్టు హోంబలే ఫిల్మ్స్ నుంచి మరో భారీ ప్రాజెక్ట్.. ఏఐ టెక్నాలజీతో శరణాగతి యానిమేషన్ మూవీ! భారత చెస్ చరిత్రలో అరుదైన మైలురాయ.. 100వ గ్రాండ్‌మాస్టర్‌గా మధ్యప్రదేశ్ ప్లేయర్ అనూజ్ శ్రీవాస్త్రి! జిల్లాలో 544 పంచాయితీలకు 3 దశలలో ఎన్నికలు పెట్టుబడుల పండుగకు విశాఖ సిద్ధం అండర్-19 ఆసియా కప్‌లో చెలరేగిన ఆర్యవీర్ సెహ్వాగ్.. శుభ్‌మన్ గిల్ రికార్డును సమం చేసిన వీరేంద్ర తనయుడు!

*నాటక రంగానికి పూర్వవైభవం:సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

Select Suryaa Now
  *నాటక రంగానికి పూర్వవైభవం:సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్



ఏపీలో 'గురజాడ నాటక శిక్షణ'కు రూ. 20 లక్షలు మంజూరు చేసిన ప్రభుత్వం..తద్వారా నాటక శిబిరాలు ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్న మంత్రి దుర్గేష్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాటక రంగాన్ని మరింత బలోపేతం చేయడం, నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, నాటక కార్యకలాపాలలో యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమే ధ్యేయంగా "గురజాడ నాటక శిక్షణ" పేరిట ప్రత్యేక నాటక శిక్షణా శిబిరాలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు(జీవో ఆర్టీ నంబర్ 1933) జారీ చేసినట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి మాట్లాడుతూ.. అర్హత కలిగిన నాటక సమాజాలు, నాటక పరిషత్తులు, గుర్తింపు పొందిన నాటక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఇతర తగిన భాగస్వామ్య సంస్థల సహకారంతో పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ విధానంలో ఈ శిక్షణా శిబిరాలు నిర్వహించబడతాయని తెలిపారు. ఇందుకోసం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 20 లక్షల వ్యయానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. ఈ శిక్షణల ద్వారా బాలల నాటక శిక్షణ, యువజన నాటక శిక్షణ, నాటక రచయితలు,దర్శకుల శిక్షణ, మేకప్ అలాగే సాంకేతిక రంగాలలో నిపుణుల ద్వారా శిక్షణ అందించబడుతుందని, ఫ్యాకల్టీ గౌరవ వేతనాలు మరియు ఇతర ఖర్చుల వివరాలను జీవోలో స్పష్టంగా పొందుపరిచామని తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశంలో ఎఫ్ డీసీ ఎంతో చురుగ్గా పనిచేస్తోందన్నారు. బోర్డు ఏర్పాటైన అనతికాలంలోనే ఇప్పటికే ప్రతిష్టాత్మకమైన నంది ఫిల్మ్, టీవీ అవార్డులు, నంది నాటకోత్సవాలు,కందుకూరి పురస్కారాలను ప్రకటించామని గుర్తుచేశారు. డిసెంబర్‌లో అమరావతి లేదా విజయవాడ వేదికగా నంది చలనచిత్ర పురస్కారాలు, తిరుపతి వేదికగా నంది టీవీ అవార్డులను అందజేస్తామని, అలాగే జనవరి నెలలో నంది నాటకోత్సవాలు,కందుకూరి పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు మరోమారు స్పష్టం చేశారు.

కళాకారులను అత్యుత్తమ ప్రమాణాలతో నాటకోత్సవాలకు సన్నద్ధం చేసేందుకు ఈ శిక్షణా శిబిరాలు ఎంతగానో దోహదపడతాయని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. తెలుగు నాటక రంగానికి మహాకవి గురజాడ వెంకట అప్పారావు అందించిన అమూల్యమైన సేవలను స్మరించుకుంటూ, ఆయన 164వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఈ శిక్షణా కార్యక్రమాలను ఆయన పేరు మీదే నిర్వహించాలని ఎఫ్.డి.సి అధికారులను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. ఈ శిబిరాల విజయవంతానికి తగిన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.అంతరించిపోతున్న కళలను పరిరక్షించడమే ప్రభుత్వ బాధ్యత అని,  సాంకేతికంగా ఎన్ని డిజిటల్ యుగాలు మారినా సజీవ కళల గొప్పతనం ఎప్పటికీ శాశ్వతమే అని మంత్రి దుర్గేష్ తెలిపారు.  

 

*జారీ చేసిన వారు:పీఆర్ఓ, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు*