BREAKING
మహిళలకు ఉచిత వృత్తి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి: కె. సుజాత భద్రాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ lo మూడో యూనిట్ నిలిచిపోవడం ప్రభుత్వ వైఫల్యమే.. మాజీ మంత్రి పువ్వాడ మాదిగ ఉద్యోగుల సమాఖ్య నూతన కమిటీకి ఘన సత్కారం ఏపీలో గృహ నిర్మాణానికి కొత్త శకం.. వైద్య ఆరోగ్యశాఖ ఔట్సోర్సింగ్ సిబ్బంది పెన్ డౌన్. మైసూరు దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్‌ 2.0 విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి ఎర్రుపాలెం మండలంలో 12.89 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి కేబీఆర్ పార్క్ చుట్టూ రింగ్ రోడ్డు ఎందుకు? కళ్యాణ మండపం నిర్మాణం, భూ సమస్య పరిష్కారం కోసం వినతి "చదవడం మా కిష్టం" కార్యక్రమంకు విశేష స్పందన నీటిని పొదుపుగా వాడుకోవాలి* *మున్సిపల్ కమిషనర్ నాగరాజు* అమృతమ్మ హత్య కేసులో మరో కీలక పరిణామం ఇండస్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి గా ‘ఇండస్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్’

న్యాయం చేయండి సార్, వరస చోరీలతో రైతు ఆవేదన.

Select Suryaa Now
న్యాయం చేయండి సార్, వరస చోరీలతో రైతు ఆవేదన.

 

కళ్యాణదుర్గం టౌన్ ప్రతినిధి :-

 

 వ్యవసాయ పొలంలో విద్యుత్‌ పరికరాలు వరుసగా చోరీకి గురవుతున్నాయని కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన రైతు దాసరి శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని కొందరు ఈ చోరీలకు పాల్పడుతున్నారనే అనుమానం ఉందని తెలిపారు. వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న తనకు విద్యుత్‌ పరికరాల చోరీలతో తీవ్ర ఆర్థిక నష్టం కలుగుతోందని వాపోయారు. శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. తన వ్యవసాయ పొలంలో ఇప్పటి వరకు మూడు పర్యాయాలు విద్యుత్‌ పరికరాలు చోరీకి గురయ్యాయని చెప్పారు. స్టార్టర్‌ పెట్టెలు, విద్యుత్‌ కేబుళ్లు, ఇతర చిన్నచిన్న విద్యుత్‌ పరికరాలను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారని తెలిపారు. మొదటి రెండు ఘటనలు జరిగినప్పుడు బయట వ్యక్తులే చోరీ చేసి ఉంటారని భావించి పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నారు. అయితే ఇటీవల మూడోసారి కూడా విద్యుత్‌ పరికరాలు చోరీ కావడంతో తీవ్రంగా కలత చెందానని చెప్పారు. వరుసగా చోరీలు జరుగుతుండటంతో తనను ఎవరైనా ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారేమోననే అనుమానం కలుగుతోందన్నారు. గ్రామంలో తాను వ్యవసాయం చేసుకుంటూ నీతి, నిజాయితీ, నిబద్ధతతో జీవనం సాగిస్తున్నానని తెలిపారు. తన ఎదుగుదలను ఓర్వలేక లేదా రాజకీయంగా అణచివేయాలనే ఉద్దేశంతోనే కొందరు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారనే అనుమానం వ్యక్తం చేశారు. అయితే దీనిపై తనకు పూర్తి ఆధారాలు లేవని, పోలీసులు సమగ్రంగా విచారణ జరిపితే అసలు విషయం వెలుగులోకి వస్తుందని పేర్కొన్నారు. మూడోసారి చోరీ జరిగిన అనంతరం ఈ విషయాన్ని కళ్యాణదుర్గం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ సీఐ దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేసినట్లు శ్రీనివాసులు తెలిపారు. తన వ్యవసాయ పొలంలో గతంలో జరిగిన చోరీలతో పాటు తాజా ఘటనపై కూడా పోలీసులు విచారణ చేపట్టాలని కోరారు. గ్రామంలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, గతంలో జరిగిన ఇలాంటి ఘటనలు, చోరీకి గురైన విద్యుత్‌ పరికరాల వివరాలను పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. వరుస చోరీల కారణంగా వ్యవసాయ పనులకు అంతరాయం ఏర్పడటంతో పాటు పంట సాగుపైనా ప్రభావం పడుతోందని తెలిపారు. రైతుల వ్యవసాయ పరికరాలకు భద్రత కల్పించేలా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు తనకు న్యాయం చేయాలని బాధిత రైతు శ్రీనివాసులు పోలీసు అధికారులను కోరారు.