బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలుకు టీడీపీ కట్టుబడి ఉంది -ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి,బీసీల రాజకీయ సాధికారతే టీడీపీ లక్ష్యం
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖరరెడ్డి స్పష్టం చేశారు. బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారని ఆయన ఆరోపించారు.ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఇందుకు సంబంధించి జీవో నెం.105, 1065లను జారీ చేసిందని పేర్కొన్నారు. అయితే వైసీపీ నేతలు కోర్టులను ఆశ్రయించి బీసీల రిజర్వేషన్లకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల బీసీలకు రాజకీయంగా మరింత ప్రాతినిధ్యం లభిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బీసీలకు న్యాయం జరిగే వరకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని అన్నారు.అన్ని వర్గాల హక్కులను కాపాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు బీసీలకు పునరుద్ధరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. బీసీలకు అన్యాయం జరగకుండా, రాజకీయ ప్రాతినిధ్యం పెంచేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని అన్నారు.
గతంలో కూడా బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలో తెలుగుదేశం పార్టీ ముందుందని బుడ్డా రాజశేఖరరెడ్డి గుర్తుచేశారు. 1987లో 20 శాతం, 1995లో 34 శాతం రిజర్వేషన్లను బీసీలకు కల్పించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. బీసీలకు రాజకీయ సాధికారత కల్పించడమే టీడీపీ విధానమని ఆయన స్పష్టం చేశారు.బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించి వారికి రాజకీయంగా మరింత ప్రాతినిధ్యం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి తెలిపారు. బీసీల హక్కుల పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు.