స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ఎన్ని అడ్డంకులు వచ్చిన అమలు చేసి తీరుతాం వలవల బాబ్జి
తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు (బాబ్జి) పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో బాబ్జి మాట్లాడుతూ బీసీలకు 34% రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు చట్టపరమైన అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గేది లేదని తెలియజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని తెలిపారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యం లో న్యాయపరమైన మార్గాల్లో మరోసారి ప్రయత్నించి బీసీలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీల సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికలను అడ్డుకునేందుకు వైఎస్సార్‌సీపీ కోర్టుల్లో కేసులు వేస్తూ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ కపట రాజకీయాలను ప్రజలు గుర్తించాలని కోరారు. న్యాయస్థానంలో తీర్పు అనుకూలంగా వచ్చినా, రాకపోయినా బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలుకు కట్టుబడి స్థానిక ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కిలపర్తి వెంకటరావు, పరిమి రవికుమార్, పట్నాల రాంపండు, గొర్రెల శ్రీధర్, పాతూరి రాంప్రసాద్ చౌదరి, సబ్నిసు కృష్ణమోహన్, పద్మనాభుని మురళి, గురుజు సూరిబాబు, బాజీ, ముత్యాల శ్రీనివాస్, దాట్ల జగన్నాథరాజు, సెనగన శ్రీనివాస్, దాసరి కృష్ణవేణి, కాకర్ల సుభద్ర, ముప్పిడి రమేష్, వీర్ల సత్యనారాయణ, హాజీ, సుందర రమాదేవి, మొండెం లీల, మందాల శ్రీను, కట్ట అన్నవరం, పోతురాజు సత్యనారాయణ, అడ్డాల నరసింహారావు, ఖాదర్ షరీఫ్, తెలగని రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
శ్రీనివాస్ తాడేపల్లిగూడెం