దసరా పండుగకు ప్రత్యేక బస్సులు సూర్యాపేట డిపో మేనేజర్ సునీత
దసరా పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సూర్యాపేట డిపో నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు డిపో మేనేజర్ ఊటుకూరి సునీత తెలిపారు.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆమె మాట్లాడుతూ
ఈ ప్రత్యేక సర్వీసులు ఈ నెల 10 నుంచి 21వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయన్నారు.
హైదరాబాద్ లోని దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్ ప్రాంతాల నుంచి సూర్యాపేటకు, సూర్యాపేట నుంచి హైదరాబాద్ కు వెళ్లే ప్రయాణికుల కోసం ఈ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు.
అలాగే సూర్యాపేట నుంచి శ్రీశైలం వెళ్లే బస్సుకు ఆన్‌లైన్ రిజర్వేషన్ సౌకర్యం అందుబాటులో ఉందని తెలిపారు.
ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని సురక్షితంగా ప్రయాణం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమం లో డిపో అసిస్టెంట్ మేనేజర్ బానోత్ సైదులు,తెలంగాణ మజ్దూర్ యూనియన్ డిపో కార్యదర్శి మాచర్ల భాస్కర్, ఎస్ డబ్ల్యూ ఎఫ్ యూనియన్ డిపో కార్యదర్శి, ఉప్పు లక్ష్మయ్య, ఐఎన్టీయూసీ డిపో కార్యదర్శి డోలునాక రవినాయక్ తదితరులు పాల్గొన్నారు.