పర్యావరణ పరిశుభ్రత కార్యక్రమం
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ రోజు కొత్తపట్నం సముద్ర తీరంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు సెంట్రల్ ఆధ్వర్యంలో, మరైన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సహకారంతో బీచ్ పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వినాయక నిమజ్జనం సందర్భంగా సముద్ర తీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు, ప్లాస్టిక్ మరియు ఇతర చెత్తను తొలగించి, పరిసరాలను పరిశుభ్రంగా మార్చేందుకు రోటేరియన్లు మరియు మరైన్ పోలీస్ సిబ్బంది కలిసి కృషి చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు సెంట్రల్ ప్రెసిడెంట్ కోగంటి గోపాలకృష్ణ, మరైన్ ఎస్‌ఐ పసుపులేటి సుబ్బారావు మరియు మరైన్ పోలీస్ సిబ్బంది, రొటేరియన్లు పాల్గొన్నారు.