పట్టణంలో వైఎస్ఆర్సిపి గుర్తింపు కార్డుల పంపిణీ
తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; తాడేపల్లిగూడెం పట్టణం 31 వ వార్డులో వైఎస్ఆర్సిపి నాయకులకు కార్యకర్తలకు గుర్తింపు కార్డుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నియోజకవర్గ ఇన్చార్జ్ వడ్డీ రఘురాం నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వడ్డీ రఘురాం మాట్లాడుతూ అధినేత ఆశయాల మేరకు అన్నిచోట్ల అభివృద్ధికి సహకరించాలని కోరారు. మాయమాటలతో ఏర్పాటైన కూటమి ప్రభుత్వం కార్యకర్తలకు సభ్యత్వ రుసుముగా 300 రూపాయలు వసూలు చేసి ఇన్సూరెన్స్ సభ్యత్వం ద్వారా అందిస్తున్నారని తెలియజేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి ప్రమాద బీమాత ఐదు లక్షలు ఇవ్వాలని అధినేత సూచించారని, కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు
శ్రీనివాస్ తాడేపల్లిగూడెం