చందన షాపింగ్ మాల్ ఎదుట సిబ్బంది ధర్నా మేనేజర్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్.. విధులు బహిష్కరించి నిరసన
అనంతపురం బ్యూరో : నగరంలోని చందన షాపింగ్ మాల్ సిబ్బంది విధులను బహిష్కరించి రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. మాల్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని ఎలాంటి కారణం లేకుండా విధుల నుంచి తొలగించారని ఆరోపిస్తూ, ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మేనేజర్ తొలగింపుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సిబ్బంది, తమ విధులను నిలిపివేసి నిరసనకు దిగారు. తొలగించిన మేనేజర్‌ను తిరిగి విధుల్లోకి తీసుకునే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని వారు స్పష్టం చేసినట్లు తెలిసింది.
ఈ ఘటనతో షాపింగ్ మాల్ వద్ద కొంతసేపు నిరసన వాతావరణం నెలకొంది. సిబ్బంది ఆందోళనతో మాల్ నిర్వహణపై చర్చ మొదలైంది. ఈ వివాదంపై షాపింగ్ మాల్ యాజమాన్యం స్పందన తెలియాల్సి ఉంది.